Sunday, March 16, 2025

అమెరికాలో పెను తుపాను..16 మంది మృతి

- Advertisement -
- Advertisement -

అమెరికాను పెనుతుపాను వణికిస్తోంది. పెద్ద ఎత్తున టోర్నడోలు విరుచుకుపడుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో 100 కు పైగాకార్చిచ్చులు చెలరేగాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఇప్పటివరకు 16 మంది మృతి చెందారు. మిసోరిలోని బేకర్స్‌ఫీల్డ్ ప్రాంతంలో టోర్నడో ధాటికి ఇద్దరు మృతి చెందగా, పలువురికి గాయాలైనట్టు అధికారులు వెల్లడించారు. టెక్సాస్ పాన్‌హ్యాండిల్ లోని అమరిల్లో కౌంటీలో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కెనడా సరిహద్దు నుంచి టెక్సాస్ వరకు గంటకు 130 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అంచనా. ఓక్లహోమా, మిస్సోరీ, న్యూమెక్సికో, టెక్సాస్, కాన్సస్‌లలో కార్చిచ్చులు చెలరేగడంతో ఆయా ప్రాంతాల నుంచి ప్రజలు ఖాళీ చేయాలని నివాసితులను వాతావరణ విభాగం ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News