Sunday, March 16, 2025

కెసిఆర్ అప్పులు, తప్పులే సరిదిద్దుతున్నాం

- Advertisement -
- Advertisement -

రెండు రోజులు అసెంబ్లీకి వచ్చి రూ.57లక్షల జీతం తీసుకున్నారు
రాష్ట్రంలో వర్క్ ఫ్రమ్ ఫామ్‌హౌస్ ఏమైనా ఉందా? బిఆర్‌ఎస్
మార్చురీలో ఉందనడంలో తప్పేముంది స్టేచర్ గురించి
మాట్లాడిన దానికి కట్టుబడి ఉన్నా కెసిఆర్ అసెంబ్లీకి
వచ్చినప్పుడే కృష్ణా జలాలపై చర్చ గవర్నర్ ప్రసంగం లేకుండానే
బడ్జెట్ పెట్టిన ఘనత మీది 32సార్లు కాదు..300సార్లు ఢిల్లీకి వెళ్తా
ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులను కలిస్తే తప్పేంటి? హస్తిన వెళ్లి
ఉత్త చేతులతో రాలేదు..ఎన్నో సాధించుకొచ్చా కమీషన్లు
తీసుకొని హైదరాబాద్‌ను సర్వనాశనం చేశారు అసెంబ్లీలో
కెసిఆర్, బిఆర్‌ఎస్‌పై నిప్పులు చెరిగిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
రూ.20వేల కోట్ల రుణమాఫీ చేసిన చరిత్ర మాది ఈ నెల 31
నాటికి రైతుభరోసా పూర్తి డ్రగ్స్ కేసులో పట్టుబడితే కరెంట్, నీళ్లు
కట్ భారత్ సమ్మిట్‌కు 100 దేశాల నుంచి ప్రతినిధులు రాష్ట్రానికి
ఐదు విమానాశ్రయాలు ఇవ్వమని కేంద్రాన్ని కోరాం అబద్ధాలపై
జిఎస్‌టి వేయాలని మోడీని కోరతా త్వరలో గుమ్మడి నర్సయ్యను
కలుస్తానని సిఎం ప్రకటన కెసిఆర్‌పై అనుచిత వ్యాఖ్యలకు
నిరసనగా సిఎం ప్రసంగాన్ని బాయ్‌కాట్ చేసిన బిఆర్‌ఎస్
తెలుగువర్శిటీకి సురవరం ప్రతాప్‌రెడ్డి పేరు, అసెంబ్లీలో బిల్లు
ప్రవేశపెట్టిన ప్రభుత్వం 

మన తెలంగాణ/హైదరాబాద్: గత పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో కెసిఆర్ చేసిన అప్పులకు తమ ప్రభుత్వం వచ్చిన 15 నెలల్లో అసలు కింద రూ.88,591 కోట్లు చెల్లించగా, మిత్తి (వడ్డీ) కింద రూ.64,768 కోట్లు కలిపి మొత్తం లక్షా 53 వేల కోట్లు చెల్లించామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం వచ్చిన 15 నెలల్లో రూ.4682 కోట్లు మాత్రమే అప్పు చేశామని పేర్కొన్నారు. తాము చేసిన అప్పుల్లో, ఆయన చేసిన అప్పుల గురించే ఎక్కువ ఖర్చు చేశామన్నారు. తాను పారదర్శకంగా ఉండాలని అనుకుంటున్నానని, అబద్దాల పునాదుల మీద రాష్ట్రాన్ని నిలబెట్టమని అన్నారు. మా బాసులు ప్రజలేనని, మా బాసులు ఫాం హౌస్‌లో లేరని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శనివారం జరిగిన చర్చలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అప్పులు చేసి పాలన చేస్తున్నారన్న బిఆర్‌ఎస్ విమర్శలను తిప్పికొడుతూ ముఖ్యమంత్రి ఎవరు ఎంత అప్పు చేశారు, వాటికి వడ్డీ ఎంత చెల్లించామనే అంశాలపై వివరణ ఇచ్చారు.

ప్రధానిని పెద్దన్న అంటే తప్పేంటి..?
ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికైనా ప్రధాని పెద్దన్నలాంటి వాడేనని రేవంత్‌రెడ్డి తెలిపారు. తాను పెద్దన్న అన్నది వాస్తవమని, ఆ విషయం రికార్డుల్లో కూడా ఉందని దీనిపై అనసవర రాధ్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధానిని కలిసే సంస్కారం మీకు లేకపోవచ్చు, కానీ తనకు ప్రధానిని కలిసే సంస్కారం ఉందని చెప్పారు. 32 సార్లు కాకుంటే 300 సార్లు ఢిల్లీకి పోతానని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కలుస్తూనే ఉంటానని అన్నారు. కిషన్ రెడ్డితో సహా అందరూ కేంద్ర మంత్రులను కలిశానని ముఖ్యమంత్రి వివరణ ఇచ్చారు. ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ వెళ్లారు అంటూ బీఆర్‌ఎస్ పార్టీ పదేపదే చేస్తున్న వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ తాను దేని కోసం ఢిల్లీ వెళుతున్నానో వాళ్లకు తెలియదా అంటూ చురుకలు వేశారు. సీఎం అయిన తర్వాత ఇప్పటి వరకు 32 సార్లు ఢిల్లీ వెళ్లాను, భవిష్యత్‌లో 300 సార్లు వెళతానంటూ సిఎం రేవంత్ రెడ్డి విస్పష్టం చేశారు. ఇప్పటికే 3 సార్లు ప్రధాని మోదీని కలిశానని, అందరు కేంద్ర మంత్రులను కలిశానని చెప్పారు. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లను కూడా కలిసినట్లు స్పష్టం చేశారు.

గోళీలు ఆడుకోవటానికి ఢిల్లీ వెళ్లటం లేదు
తాను గోళీలు ఆడుకోవటానికి ఢిల్లీ వెళ్లటం లేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాల కోసం రాష్ట్రానికి రావాల్సిన వాటా నిధులు, పనుల కోసం వెళ్లినట్లు స్పష్టం చేశారు. అలాగే ఢిల్లీ వెళ్లి ఊరికే తిరిగి రాలేదని, ఢిల్లీ నుంచి సాధించింది ఎంతో ఉందని వివరించారు. ఢిల్లీకి వెళ్లి కేసుల మాఫీ గురించో, చీకట్లో కాళ్లు పట్టుకోవడానికో తాను వెళ్లలేదంటూ చురకలు అంటించారు. ఢిల్లీ వెళ్లిన తర్వాతే వరంగల్ ఎయిర్ పోర్టు వచ్చింది నిజం కాదా, రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం పనులు టెండర్ల వరకు వచ్చింది నిజం కాదా అంటూ ప్రతిపక్షాల విమర్శలను రేవంత్‌రెడ్డి తిప్పి కొట్టారు. రాష్ట్రానికి నాలుగు వేల కోట్ల రూపాయల ప్రపంచ బ్యాంక్ అప్పులు తీసుకొచ్చింది నేను కాదా, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ల్యాండ్స్‌ను సాధించింది నేను కాదా అంటూ సభ ద్వారా బిఆర్‌ఎస్ పెద్దలను నిలదీశారు. పదేళ్లు కేసీఆర్ సీఎంగా ఉండి సాధించలేనిది తాను సాధించానని పేర్కొన్నారు.

160 ఎకరాల ఆర్మీ భూములను తెలంగాణకు అప్పగించారని, దీనికి కృతజ్ణత చెబితే తప్పేంటని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ను కలిసి హ్యాండ్ లూం ఇనిస్టిట్యూట్ తీసుకొచ్చానని, వరంగల్‌లో పీఎం మిత్ర టెక్స్ టైల్ పార్క్ పెండింగ్ నిధులను తీసుకొచ్చానని, జహీరాబాద్ నిమ్స్‌కు రూ.1200 కోట్లు తీసుకొచ్చిన విషయాన్ని సభలో సిఎం రేవంత్‌రెడ్డి తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఢిల్లీకి వెళ్లటం వల్లే కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధించానని, హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణ దిశగా వెళుతున్నామని, మూసీ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ నిధుల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. భారత్ సమ్మిట్ కు 100 దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారని, తెలంగాణ రైజింగ్ కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. ఇందు కోసం కేంద్రం నుంచి చాలా అనుమతులు రావాల్సి ఉందని, దీని కోసమే ఢిల్లీ వెళుతున్నట్లు వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News