Tuesday, March 18, 2025

విమర్శలు ప్రజాస్వామ్యానికి ఆత్మ.. స్వాగతిస్తా

- Advertisement -
- Advertisement -

నా శక్తి 140 కోట్ల మంది భారతీయుల మద్దతులో ఉంది

పాకిస్తాన్‌తో శాంతి కోరితే ద్రోహమే ఎదురైంది మా నాన్న టీ
దుకాణానికి వచ్చే వారిని చూసి ఎంతో నేర్చుకున్నా ఆర్‌ఎస్‌ఎస్ ఎంతో
గొప్ప సంస్థ, జీవితంలో విలువలు నేర్పింది నాకు, ట్రంప్‌నకు
జాతి ప్రయోజనాలే ముఖ్యం.. అందుకే బాగా కనెక్ట్ అవుతున్నాం
అమెరికా కృత్రిమ మేధ పరిశోధకుడు లెక్స్ ఫ్రిడ్‌మ్యాన్
పాడ్‌కాస్ట్‌లో ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: విమర్శలు అనేవి ప్రజాస్వామ్యానికి ఆత్మలాంటివని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. అందుకే తాను వాటిని ఎప్పటికీ స్వాగతిస్తానని, అయితే విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలని తెలిపారు. అమెరికాకు చెంది న కృత్రిమ మేధ పరిశోధకుడు లెక్స్ ఫ్రిడ్‌మ్యాన్ పాడ్‌కాస్ట్‌లో మోడీ అనేక అంశాలను స్పృశించారు. తన శక్తి ఈ దేశంలోని 140 కోట్ల మం ది భారతీయులలో దాగి ఉందని, తాను ప్రపంచాధినేతలతో కరచాలనం చేసినప్పుడు 140 కోట్ల మంది భారతీయులు చేస్తున్నట్టుగానే భా విస్తానని తెలిపారు. తన బాల్యం మొత్తం పేదరికంలోనే గడిచిందని, నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. పాఠశాలకు వెళ్లినప్పుడు బూట్ల ను తళతళా మెరిపించేందుకు స్కూళ్లో వాడిపడేసిన సుద్ద ముక్కలను సేకరించి వాడుకునేవాడినని పేర్కొన్నారు. అమెరికా ప్రెసిడెంట్ డోనా ల్డ్ ట్రంప్‌తో తనకు పరస్పర విశ్వాసం ఉందని ప్రధాని మోదీ అన్నారు. తాము ఉభయులూ తమ జాతీయ ప్రయోజనాలను అన్నిటికంటే ఎక్కువగా భావిస్తున్నందువల్లనే ఇద్దరమూ బాగా కనెక్ట్ అవుతున్నామని మోదీ తెలిపారు. డోనాల్డ్ ట్రంప్ రెండో టర్మ్‌లో చాలా ధైర్యంగా అమెరికా ఫస్ట్

సాహసో పేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని మోదీ ప్రశంసించారు. ట్రంప్‌ను ధైర్యవంతుడిగా, సొంతంగా నిర్ణయాలు తీసుకునే వ్యక్తి గా, అమెరికా పట్ల అచంచలమైన అంకితభా వం ఉన్నవ్యక్తిగా కొనియాడారు. 2024 అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ట్రంప్ పై ఓ దుండగుడు కాల్పులు జరిపి నప్పుడు కూడా ఇదే స్పూర్తి కన్పించిందని ఆయన అన్నారు. ట్రంప్‌కు స్పష్టమైన విజన్, రోడ్ మ్యాప్ ఉందని, ప్రతి ఒక్కటీ ఆయన కోరుకున్న లక్ష్యాల వైపు నడుపుతుందన్న విశ్వాసాన్ని మోదీ వ్యక్తం చేశారు. ట్రంప్ బలమైన, సమర్థులైన గ్రూప్ ను ఏర్పాటు చేసుకున్నారని వారంతా ట్రంప్ దార్శికతను అమలు చేసే సామర్థ్యం కలిగిన వారని తాను భావిస్తున్నానని ఆయన తెలిపారు. ఇటీవల అమెరికా పర్యటనలో ఆ బృందం సభ్యులను తాను కలిసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. తనపై కాల్పులు జరిగినా, ట్రంప్ చెక్కుచెదరకుండా తన జీవితం తన దేశం కోసమే అన్న అంకిత భావంతో ఉన్నారు. ఇది ఆయన అమెరికా ఫస్ట్ అన్న స్పూర్తికి అద్దం పట్టింది అన్నారు మోదీ. తాను భారతదేశమ ముందు అనే భావనను నమ్మినట్లే ఆయన విశ్వాసం కన్పించిందని అందుకే తాము బాగా కనెక్ట్ అవుతామని ప్రధాని మోదీ తెలిపారు.

పాక్‌తో శాంతి కోరితే.. ద్రోహం ఎదురైంది
పొరుగు దేశమైన పాకిస్తాన్ తో శాంతి కోసం భారతదేశం చేసిన ప్రతి ప్రయత్నానికి అటునుంచి శతృత్వం, ద్రోహమే ఎదురైందని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ముందైనా ద్వైపాక్షిక సంబంధాలను మెరుగు పరచుకోడానికి ఆదేశ నాయకత్వం ప్రయత్నిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఉభయదేశాల మధ్య సంబంధాలు కొత్తగా చిగురించాలనే భావనతోనే 2014లో ప్రధానిగా తన తొలి ప్రమాణ స్వీకార సభకు పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను ప్రత్యేకంగా ఆహ్వానించానని గుర్తుచేశారు. పాక్‌తో శాంతి కోసం చేసిన ప్రతి ప్రయత్నానికి ద్రోహం, శతృత్వంతో కూడిన ఎదురు దెబ్బలే ఎదురయ్యాయన్నారు. పాకిస్తాన్ లో సామాన్యప్రజలు శాంతినే కోరుతున్నారని తాను నమ్ముతున్నానన్నారు. తాను సార్క్ దేశాల నేతలశిఖరాగ్ర సభ ఏర్పాటు చేసినప్పుడు ప్రపంచ దేశాలు హర్షించాయని, పాకిస్తాన్ మాత్రం మైత్రీ బంధాన్ని కొనసాగించేందుకు తగిన కృషిచేయలేదని ప్రధానిమోదీ పేర్కొన్నారు.

ఆర్‌ఎస్‌ఎస్ జీవితంలో విలువలు నేర్పింది
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తనకు జీవితం లో విలువలు నేర్పిందని,క్రమశిక్షణ నేర్పిందని, దీనిని తాను అదృష్టంగా భావిస్తున్నానని మోదీ అన్నారు. దేశమే అత్యున్నతమైనదని, దేశానికి, ప్రజలకు సేవ చేయడం దేవుడికి సేవచేయడం లాంటిదని ఆర్ ఎస్ ఎస్ బోధిస్తుందని. ఇంత పవిత్రమైన సంస్థలనుంచి విలువలు పొందడం తన అదృష్టమని ప్రధాని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ వంటి గొప్ప, స్వచ్ఛంద సంస్థ ప్రపంచంలో మరొకటి లేదన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు అనుబంధ సంస్థ విద్యాభారతి 25 వేల స్కూళ్ల ద్వారా కోట్లాది మంది విద్యార్థులకు చాలా తక్కువ ఫీజుతో విద్యాబోధన చేస్తోందన్నారు. అలాగే సేవాభారతి, వనవాసి కల్యాణ్ ఆశ్రమం, భారతీయ మజ్దూర్ సంఘ్ వంటి సంస్థల కృషిని ప్రశంసించారు.

అప్పుడే నన్ను శిక్షించాలనుకున్నారు..
2002లో గోధ్రా ఉదంతం తర్వాత జరిగిన అల్లర్లపై తన వ్యతిరేకులు, అప్పట్లో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం తనని శిక్షించాలనుకున్నాయన్నారు. అయితే కోర్టులు తనని నిర్దోషిగా తేల్చాయన్నారు. గోధ్రా కంటే ముందు గుజరాత్‌లో చిన్నచిన్న విషయాలకు కూడా అల్లర్లు జరిగేవి. గాలిపటాల పోటీలో, సైకిళ్లు ఢీకొన్నప్పుడు కూడా మత ఘర్షణలు జరుగుతుండేవి. గుజరాత్‌లో 1969లో జరిగిన మతఘర్షణలైతే ఆరు మాసాలపాటు కొనసాగయని అన్నారు. గుజరాత్ అసెంబ్లీకి తాను శాసనసభ్యుడిగా ఎన్నికైన మూడు రోజులకే గోధ్రా రైలు దగ్ధం ఘటన జరిగిందన్నారు. గోధ్రాయే ఘోరమైన అల్లర్లు అనుకుంటే కాందహార్ హైజాక్, పార్లమెంటు మీద దాడి, ముంబై ఉగ్రదాడులు ఏమైనా తక్కువవా అని ఆయన నిలదీశారు. ప్రతి ఒక్కరూ శాంతినే కోరుకుంటారు. అవాంఛనీయ ఘటనలు జరగాలని ఎవరూ కోరుకోరని మోడీ తెలిపారు. గత 22 ఏళ్లలో గుజరాత్‌లో అల్లర్లు జరుగకపోవడం మీరు చూడొచ్చన్నారు. అల్లర్ల తర్వాత తన ఇమేజ్‌ను దెబ్బతీయడానికి కుట్రలు జరిగినా, కోర్టులు తనను నిర్దోషినని తేల్చాయన్నారు.
ఎన్నికల సంఘాన్ని కీర్తించిన మోడీ
స్వతంత్రంగా, నిష్పాక్షింగా ఉండే భారతీయ ఎన్నికల సంఘాన్ని ప్రధాని మోడీ కీర్తించారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన ఇండియాలో జరిగిన ఎన్నికల ప్రక్రియను గ్లోబల్ కమ్యూనిటీ విశ్లేషించాలి, అధ్యయనం చేయాలన్నారు. 2024 భారత సార్వత్రిక ఎన్నికల గురించి చెబుతూ ఉత్తర అమెరికా కన్నా రెట్టింపు జనాభా, యూరొపియన్ యూనియన్ మొత్తం జనాభా కన్నా ఎక్కువగా 98 కోట్ల మంది ఓటర్లు నమోదు చేసుకున్నారన్నారు. మే నెల మండు టెండలను కూడా లెక్కచేయకుండా కొన్ని ప్రాంతాల వారు బయటికి వచ్చి ఓటేశారన్నారు. దేశవ్యాప్తంగా 10 లక్షల పోలింగ్ బూత్‌లకు ఎన్నికల సంఘం సరంజామా సరఫరా చేయడాన్ని మోడీ కీర్తించారు. దేశంలో 2500 కన్నా ఎక్కువ రాజకీయ పార్టీలు పాల్గొన్నాయన్నారు. పేదలైన మన దేశ ప్రజలు టెక్నాలజీని అందిపుచ్చుకున్నారన్నారు.

ఇండియా, చైనా మధ్య పోటీ ఘర్షణగా మారకూడదు
ఇండియా, చైనా మధ్య ఉన్న విభేదాలను చర్చల ద్వారానే అధిగమించాలని, పరస్పర ప్రయోజనాల కోసం రెండు దేశాలు సహకరించుకోవాలని మోడీ అన్నారు. చైనా అధ్యక్షుడు జీతో తన ఇటీవలి సమావేశం సరిహద్దులో సాధారణ స్థితిని తీసుకొచ్చిందన్నారు. ఇండియా, చైనాల మధ్య సహకారం ఇరుదేశాలకే కాక ప్రపంచ సుస్థిరతకు, సౌభాగ్యానికి కారణం కాగలదన్నారు. చైనా, ఇండియా మధ్య ప్రాచీన కాలం నుంచే సాంస్కృతిక, నాగరికత సంబంధాలున్నాయన్నారు. శతాబ్దాల ప్రాచీన చరిత్రలోకి వెళితే ఇండియా, చైనా మధ్య ఘర్షణలే లేవని అర్ఘం కాగలదన్నారు. ఒక కుటుంబంలో కూడా అంతా సక్రమంగా ఉండదని మోడీ ఉదాహరించారు. చైనాతో చర్చల ద్వారానే సంబంధాలు మెరుగుపరుచుకుంటామన్నారు.

ఇటీవలి ఫలితాలు పాక్ కన్నా భారత క్రికెట్ జట్టే మెరుగనిపించాయి
‘నేనేమి క్రికెట్ ఎక్స్‌పర్ట్‌ను కాకపోయినా ఇటీవలి ఫలితాల దృష్టా భారత జట్టు, పాకిస్థాన్ జట్టు కన్నా మెరుగని రుజువు చేసిందని చెప్పగలను’ అని మోడీ అన్నారు. ‘అత్యుత్తమ ఫుట్‌బాల్ ఆటగాడిగా ఎవరిని ఎంచుకుంటారు?’ అని ప్రశ్నించినప్పుడు ‘1980 దశకంలో హీరోగా మన్ననలను అందుకున్న డియోగ మరడోనాను ఎంచుకుంటాను, కానీ నేటి తరంలో లియోనెల్ మెస్సీని ఎంచుకుటాను’ అన్నారు. ‘నా దృష్టిలో క్రీడలు ప్రపంచానికంతటికీ శక్తిని ఇస్తాయి. మానవ పరిణామ క్రమానికి క్రీడలు తోడ్పడతాయని నేను నమ్ముతున్నాను’ అన్నారు. భారత్‌లో ఫుట్‌బాల్ ప్రజాదరణ గురించి ప్రశ్నించినప్పుడు, మధ్యప్రదేశ్‌లోని ఓ చిన్న గ్రామం ఫుట్‌బాల్ విషయంలో ఎంత క్రేజ్‌గా ఉందో వెల్లడించారు. ‘షహదోల్ అనే జిల్లాలో ఓ గిరిజన ప్రాంతంలో చిన్నా పెద్ద అంతా కలిసి దాదాపు 80 నుంచి 100 మంది జెర్సీలు వేసుకుని మరీ పుట్‌బాల్ ఆడడాన్ని నేను చూశాను. అప్పుడు వారితో మీరెక్కడి వారని అడిగితే, వారు మినీ బ్రెజిల్ వారమని ఆశ్చర్చపరిచారు’ అని మోడీ వివరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News