Tuesday, March 18, 2025

ఫ్యామిలీ చూడదగ్గ సినిమా

- Advertisement -
- Advertisement -

శివ్ హరే దర్శకత్వం వహించిన ‘కిస్ కిస్ కిస్సిక్’ చిత్రంలో శుశాంత్, జాన్య జోషి, విధి వంటి న్యూ టాలెంట్ పరిచయం అవుతుండగా, విజయ్ రాజ్, మురళీ శర్మ వంటి అనుభవజ్ఞులైన నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని గణేష్ ఆచార్య భార్య విధి ఆచార్య (v2s ప్రొడక్షన్) నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన గణేష్ ఆచార్య స్వయంగా కొరియోగ్రఫీ చేస్తున్నారు. అద్భుతమైన ట్రాక్ రికార్డ్ వున్న మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ మల్టీ లాంగ్వెజ్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తోంది. ఈ చిత్రం మార్చి 21న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రీరిలీజ్ ప్రెస్ మీట్‌లో గణేష్ ఆచార్య మాస్టర్ మాట్లాడుతూ..‘పుష్ప సినిమాలో ‘కిస్ కిస్ కిస్సిక్’ సాంగ్ బిగ్ హిట్. ఇదే టైటిల్‌తో ఈ సినిమా మార్చి 21న వస్తోంది. ఇందులో చాలా బ్యూటీఫుల్ కాన్సెప్ట్ వుంది. యాక్షన్ రియల్ షతీస్ చేశారు. తొమ్మిది పాటలు వున్నాయి. న్యూ ట్యాలెంట్ ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు’ అని అన్నారు. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ నవీన్ ఎర్నేని మాట్లాడుతూ..‘ఈ సినిమా మేము చేయడానికి ప్రధాన కారణం గణేష్ ఆచార్య మాస్టర్. గణేష్ ఆచార్య మాస్టర్ తో మాకు చాలా మంచి అసోసియేషన్ ఉంది. మాకు చాలా సినిమాలు చేశారు. ఈ సినిమా రషెస్ చూశాను చాలా అద్భుతంగా ఉన్నాయి’ అని తెలిపారు. హీరో సుశాంత్ మాట్లాడుతూ..‘ఈ సినిమా మంచి కమర్షియల్ ప్యాకేజ్ లా ఉంటుంది. యాక్షన్ రొమాన్స్ కామెడీ సాంగ్స్ అన్ని అద్భుతంగా ఉంటాయి. ఫ్యామిలీ అందరితో కలిసి చూడదగ్గ సినిమా ఇది’ అని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో జాన్య జోషి, విధి తదితరులు పాల్గొన్నారు.To

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News