Tuesday, March 18, 2025

హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల తుది జాబితా విడుదల

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన నియామక పరీక్ష తుది ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ వసతిగృహాల్లో 581 హాస్టల్ వె ల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను టిజిపిఎస్‌సి సోమవారం వెల్లడించింది. ఈ పోస్టులకు గతేడాది జూన్ 24 నుంచి 29 వరకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్షలు (సిబిఆర్‌టి) నిర్వహించిన కమిషన్, ఆ తర్వాత ధృవపత్రాల పరిశీలన పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు మొత్తంగా 1,45,359 మంది దరఖాస్తు చేసుకోగా.. 82వేల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 581 పోస్టులకు గాను 574 మందిని ఎంపిక చేసినట్లు టిజిపిఎస్‌సి పేర్కొంది. వీరిలో 561 మంది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 1, 2, లేడీ సూపర్‌వైజర్ పోస్టులకు ఎంపిక కాగా.. 13 మంది వార్డెన్, మాట్రన్ గ్రేడ్ 1, గ్రేడ్ -2 పోస్టులకు ఎంపికయ్యారని తెలిపింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను టిజిపిఎస్‌సి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది. సంబంధించి నిబంధనలకు అనుగుణంగా తదుపరి ప్రక్రియలను పూర్తి చేసి పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News