Tuesday, March 18, 2025

ఆదాయార్జనలో అట్టర్‌ఫ్లాప్

- Advertisement -
- Advertisement -

రూ.70వేల కోట్ల మేరకు తగ్గిందని సిఎం అంగీకరించారు బడ్జెట్‌కు ముందే
అప్రూవర్‌గా మారారు సంపద సృష్టించే జ్ఞానం లేదు ఆత్మహత్యలతో
తల్లడిల్లుతుంటే రాష్ట్రంలో అందాల పోటీలు సిగ్గుచేటు నాకు అడ్డమైనవాళ్లతో
లింకులు పెట్టినప్పుడు మా కుటుంబాలు బాధపడలేదా? : కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి రూ.70 వేల కోట్ల మేర ఆదాయం తగ్గిందని సిఎం రేవంత్ రెడ్డి అంగీకరించారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. ఇం తకంటే రాష్ట్రానికి ఘోర అవమానం ఇంకొకటి ఉండదని వ్యాఖ్యానించారు. సిఎం రేవంత్ రెడ్డి బడ్జెట్ కంటే ముందే నేరాన్ని అంగీకరించి అ ప్రూవర్‌గా మారారని, దీని ద్వారా రాష్ట్ర ప్రభు త్వం పూర్తి అట్టర్‌ఫ్లాప్ అని అంగీకరించినట్లే అ ని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభి న్నం కావడానికి సిఎం అవలంబిస్తోన్న విధానాలే కారణమని ఆరోపించారు. కెసిఆర్‌పై ద్వేషంతో కాళేశ్వరం ప్రాజెక్టును బంద్ పెట్టి సాగును నాశనం చేశారని మండిపడ్డారు. 2014లో రేవంత్ రెడ్డి లాంటి మూర్ఖుడు సిఎం అయి ఉంటే.. తెలంగాణ వెనక్కి పోతుందన్న సమైఖ్యాంధ్రనేతల మాటలు నిజం అయ్యేవని అన్నారు. తెలంగాణ రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయి మాదిరి తయారైందని కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ లాబీలో సోమవారం కెటిఆర్ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్ గురించి చెప్పమంటే.. సిఎం ఢిల్లీకి పంపే మూటల లెక్కలు చెప్తున్నారన్నారని విమర్శించారు. ఖర్గే, రాహుల్, ప్రియాంకగాంధీ, కెసి వేణుగోపాల్‌కు డబ్బులు పంపే పనిలో రేవంత్ రెడ్డి బిజీ అంటూ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఆందోళన అవుతుంటే.. రాహుల్ గాంధీ ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నించారు.

బిజెపి నేతలతో రహస్య భేటీలను సిఎం ఎందుకు ఖండించట్లేదు..?
తమకు చాలా విషయాలు తెలుసు అని, తాము వాస్తవాలు బయటపెడితే సిఎంకు ఇబ్బందులు తప్పవు అని చెప్పారు. బిజెపి నేతలతో రహస్య భేటీలను రేవంత్ ఎందుకు ఖండించట్లేదు..? అని ప్రశ్నించారు. ఆ రహస్య భేటీలపై బిజెపి నేతలు కూడా మాట్లాడటం లేదని, రహస్య భేటీలను అంగీకరించలేకపోతే ఆ పార్టీ ఎంఎల్‌ఎ రాజాసింగ్‌పై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఫార్ములా ఈ-రేస్ వద్దన్న సిఎం.. నగరంలో అందాల పోటీల నిర్వహణతో ఏం సాధిస్తారని అడిగారు. అందాల పోటీలకు రూ.2 వేల కోట్లు ఖర్చు చేసే బదులు.. మహిళలకు రూ.2500 చొప్పన ఇవ్వాలని చెప్పారు. అందాల పోటీలు పెట్టి రేవంత్ ఏం సాధించాలనుకుంటున్నారని ప్రశ్నించారు.

రాష్ట్రం అప్పులపాలైందని చెప్పి, అందాల పోటీలు పెడతారా..? అని నిలదీశారు. మింగ మెతుకు లేదు, మీసాలకు సంపెంగ నూనె అన్నట్టుంది అందాల పోటీ కథ అని విమర్శించారు. రూ.46 కోట్లతో ఫార్ములా ఈ రేసు పెట్టి రాష్ట్రానికి ఏం తెస్తామో చెప్పినా వినకుండా అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు రూ.250 కోట్లతో అందాల పోటీలు ఎందుకు నిర్వహిస్తున్నారని అన్నారు. ఆత్మహత్యలతో తల్లడిల్లుతున్న రాష్ట్రంలో అందాల పోటీలు సిగ్గుచేటు
అని పేర్కొన్నారు. కరెంట్ కోతలు, తీవ్ర వ్యవసాయ సంక్షోభంలో రాష్ట్రం చిక్కుకుంటే, ప్రభుత్వం ఫోకస్ మొత్తం అందాల పోటీల మీద ఉందని ఆరోపించారు. ఫార్ములా ఈ రేసును ఒప్పందం ఏకపక్షంగా రద్దు చేసుకుని రూ.46 కోట్లు పోవడానికి సిఎం కారణమయ్యారని ఆరోపించారు. ఈ ఒప్పందం రద్దు చేయడంతో జరిగిన ప్రజల సొమ్ము నష్టంపై తాము ప్రభుత్వంలోకి రాగానే విచారణ జరుపుతామని వెల్లడించారు.

గాసిప్స్ బంద్ చెయ్..
మెదటి ఏడాదిలో సిఎం రేవంత్ రెడ్డికి పాస్ మార్కులు కూడా రాలేదని కెటిఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని రేవంత్ ఒప్పుకున్నారన్నారు. సంపద సష్టించే జ్ఞానం, తెలివి సిఎంకు లేదని విమర్శించారు. ఢిల్లీకి 40 సార్లు కాకపోతే 400 సార్లు పోయి ప్రధానమంత్రి మోడీ, రాహుల్ గాంధీ కాళ్లు పట్టుకున్నా తమకేం సమస్య లేదని, కానీ తెలంగాణకి ఎన్ని నిధులు తెచ్చినావో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రంతో సఖ్యతగా ఉండి.. నిధులు సాధిస్తానని ఎంత తెచ్చారని నిలదీశారు. గాసిప్స్ బంద్ చేసి.. రేవంత్ రెడ్డి గవర్నరెన్స్‌పై దృష్టి పెట్టాలని హితవు పలికారు. పదిహేనేళ్లుగా రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్‌లో పత్తాలు ఆడేవారితో గాసిప్స్ నడపటం అలవాటంటూ ఎద్దేవా చేశారు.

రేవంత్ ఏడాది కాలంగా చేసిందంతా నెగటివ్ పాలిటిక్స్, అక్రమ నిర్భందాలు, తెలంగాణను కాన్సర్ అంటూ రాష్ట్ర పరువు తగ్గించడం వంటి మాటల వల్లనే తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని మండిపడ్డారు. తమకు కుటుంబాలు లేవా.. తమకు పిల్లలు లేరా.. రేవంత్‌రెడ్డికే ఉన్నారా..? అని ప్రశ్నించారు. తనకు అడ్డమైనవారితో లింకులు పెట్టిన నాడు.. తమ కుటుంబాలు బాధ పడలేదా..? అని అడిగారు. సోషల్ మీడియా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యవస్థ అని.. అమెరికాలో ఉన్నవాడు కామెంట్ పెడితే.. ఎలా శిక్షిస్తారో రేవంత్‌రెడ్డి చెప్పాలని అన్నారు. మన జాతిపిత గాంధీని చంపింది గాడ్సే అని పేర్కొన్నారు. తెలంగాణ జాతిపిత లాంటి కెసిఆర్‌పై చిల్లర మల్లర మాటలు మాట్లాడుతున్నది అభినవ గాడ్సె రేవంత్ రెడ్డి అని, రేవంత్‌వి గాడ్సె మూలాలే అంటూ కెటిఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News