- Advertisement -
హైదరాబాద్: విద్యుత్ లేకపోవడంతో తన నియోజకవర్గంలో ఐదు వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని కాంగ్రెస్ ఎంఎల్‌ఎ గండ్ర సత్యనారాయణ రావు మండిపడ్డారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. చెక్ డ్యామ్‌లు నిర్మిస్తే 58 వేల ఎకరాల సాగులోకి వస్తాయని, గతంలో రూ.220 కోట్లు ఖర్చుచేసినా ఒక్క ఎకరాలకు నీళ్లు రాలేదన్నారు. విద్యుత్ సౌకర్యం కల్పిస్తే మూడు వేల ఎకరాలు అందుబాటులోకి వస్తుందన్నారు. ఒక్క భీంఘన్‌పూర్ చెరువు కింద ఐదు వేల ఎకరాలు భూమి సాగు అవుతోందన్నారు. గత కాంట్రాక్ట్ రద్దు చేసి గుత్తెదారుపై చర్యలు తీసుకోవాలని గండ్ర డిమాండ్ చేశారు.
- Advertisement -