Thursday, March 20, 2025

శంభాజీ నగర్ లో ఉద్రిక్తతలు…. పలు ప్రాంతాల్లో కర్య్ఫూ

- Advertisement -
- Advertisement -

ముంబయి: మహారాష్ట్రలోని శంభాజీ నగర్ లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని కూల్చేయాలని కొందరు డిమాండ్ చేయడంతో హైటెన్షన్ నెలకొంది. సోమవారం అర్థరాత్రి నాగ్ పూర్ జిల్లాలో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోవడంతో ప్రజలు భయంతో వణికిపోయారు. అల్లర్లను అదుపు చేసేందకు భద్రతా బలగాలు, పోలీసులు ప్రయత్నించారు. నాగ్ పూర్ లోని పలు ప్రాంతాలలో పోలీసులు 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు కర్య్ఫూ విధించారు. నాగ్‌పూర్‌లోని హంసపురి ప్రాంతంలో రెండు వర్గాల మధ్య అర్థరాత్రి ఘర్షణలు చేలరేగినట్టు పోలీసులు వెల్లడించారు. కొందరు దుండగులు వాహనాలకు నిప్పు పెట్టడంతో పాటు షాపులు, నివాసాలను ధ్వంసం చేశారు. ఈ ఘర్షణలో 20 మంది గాయపడినట్టు స్థానిక మీడియా వెల్లడించారు. ఘర్షణలకు దిగిన 17 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

శంభాజీనగర్ జిల్లా ఖుల్దాబాద్‌లో ఉన్న ఔరంగజేబు సమాధి వద్దకు వెళ్లే సందర్శకులపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఇకపైన అక్కడికి ఎవరైనా వెళితే రిజిస్టర్‌లో సంతకం చేయడంతో పాటు, ఐడి కార్డును చూపించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. వివిధ ప్రభుత్వ కార్యాలయాల వద్ద విహెచ్‌పి కార్యకర్తలు నిరసనలు చేపట్టి, ఔరంగజేబు సమాధిని నిర్మూలించాలంటూ మెమోరాండంలు సమర్పించిన విషయం విధితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News