- Advertisement -
హైదరాబాద్: ప్రస్తుతం తాగునీటి సరఫరాలో ఎలాంటి సంక్షోభం లేదని మంత్రి సీతక్క తెలిపారు. నీటి సరఫరాకు ఆటంకం ఏర్పడితే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. మంగళవారం శాసన మండలిలో ఆమె మాట్లాడారు. భూగర్భ జలవనరులను కూడా సిద్ధంగా ఉంచామని, నీటి సరఫరాను అనునిత్యం పరిశీలిస్తున్నామని, నీటి సమస్యలపై ఫిర్యాదులకు టోల్‌ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేశామని వివరించారు. వేసవిలో నిరంతరం తాగునీటి కోసం రిజర్వాయర్ల నుంచి నీటిని సరఫరా చేస్తామని, నీటి సరఫరా అవసరాలకు 2024 జనవరి నుంచి ఇప్పటివరకు రూ.298 కోట్లు మంజూరు చేశామన్నారు. 34 భారీ తాగునీటి సరఫరా పథకాల కోసం రూ.745 కోట్లు కేటాయించామని, గ్రామాల్లో నీటి అవసరాల కోసం రూ.175 కోట్లతో ప్రతిపాదనలు పంపామని సీతక్క ప్రకటించారు.
- Advertisement -