Thursday, March 20, 2025

ఆ భూములను తాకట్టు పెట్టి రూ.20 వేల కోట్లు అప్పు చేశారు: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రాజెక్టుల కింద పంట ఎండితే తమది బాధ్యత అవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నారని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్ రావు తెలిపారు. గోదావరి, కృష్ణా నది ఆయకట్ట దిగువన పంటలు ఎండుతున్నాయని, ప్రభుత్వ నిర్లక్షంతోనే పంటలు ఎండిపోతున్నాయని మండిపడ్డారు. మంగళవారం ఆయన శాసన సభలో మాట్లాడారు. నిన్నఅజెండాలో రెండు ముఖ్యమైన ప్రశ్నలు ఉన్నాయని హరీష్ రావు తెలియజేశారు. హెచ్‌ఎండిఎ భూములను రేవంత్ ప్రభుత్వం తాకట్టు పెట్టి రూ.20 వేల కోట్లు అప్పులు చేసిందని దుయ్యబట్టారు. టిజిఐఐసి భూములు తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్ల అప్పు తీసుకున్నారని, జలమండలి, జిహెచ్‌ఎంసి నుంచి పది వేల కోట్ల చొప్పున అప్పులు చేశారని దుయ్యబట్టారు. మా ప్రశ్న రాకుండా ముందు ప్రశ్నలను సాగదీశారని చురకలంటించారు. ప్రతిపక్షాల ప్రశ్నలు రాకుండా గొంతు నొక్కుతుండడంతో నిన్న సభాపతికి ఫిర్యాదు చేశామన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు ఆన్‌లైన్ లో పెట్టల్లేదన్న ఎంఐఎం ప్రశ్న రాకుండా చేశారని ధ్వజమెత్తారు. ప్రశ్నోత్తరాలు రద్దు చేసినట్లు సోమవారం రాత్రి సర్కూలర్ ఇవ్వడమేంటని హరీష్ రావు అడిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News