బెంగళూరు: మార్చి 3వ తేదీన దుబాయ్ నుంచి 14 కిలోల బంగారం తీసుకువస్తూ.. నటి రన్యా రావు పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో డిఆర్ఎ అధికారులు ఆమెపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కేసులో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. తాజా బంగారం స్మగ్లింగ్ కేసులో తెలుగు హీరో కొండూరు తరుణ్ రాజ్‌ను అరెస్ట్ చేశారు.
2018లో ‘పరిచయం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు తరుణ్ రాజ్. ఈ సినిమాకు లక్ష్మీకాంత్ చెన్నా దర్శక్తవం వహించగా.. సిమ్రత్ కౌర్ హీరోయిన్. అయితే తొలి సినిమానే ఫ్లాప్ కావడంతో మళ్లీ అతనికి అవకాశం రాలేదు. అయితే ఇప్పుడు ఈ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అతని పేరు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో వెనుక సూత్రధారి తరుణ్ రాజ్ అని పోలీసులకు తెలిసింది. 2019 నుంచి రన్యారావుతో తరుణ్ రాజ్‌కి సంబంధాలు ఉన్నట్లు నిర్ధారణ అయింది.
ఇద్దరు కలిసి పలుమార్లు దుబాయ్‌కి వెళ్లినట్లు, ఎవరకీ అనుమానం రాకుండా.. అమెరికా పాస్‌పోర్టును ఉపయోగించారట. అంతేకాక.. బంగారం కొని అమ్మడానికి దుబాయ్‌లో వీరా డైమండ్ ట్రేడింగ్ అనే సంస్థను 2023లో ఏర్పాటు చేశారట. ఇందులో ఇద్దరికి చెరి 50 శాతం వాట ఉందని పోలీసులు గుర్తించారు. దీంతో బెంగళూరు పోలీసులు తరుణ్ రాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు.