Thursday, March 20, 2025

భూములకు మార్కెట్ ధర ప్రకారం చెల్లింపులు: కోమటిరెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆర్ఆర్ఆర్ దక్షిణభాగం అలైన్ మెంట్ చేసి కేంద్రానికి పంపుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఆర్ఆర్ఆర్ గురించి కేంద్రమంత్రితో చర్చలు జరిపామని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఆర్ఆర్ఆర్ పూర్తయితే హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయని చెప్పారు. వాళ్ల మాదిరిగా తమకు రోడ్లు అమ్ముకునే అలవాటు లేదని తెలియజేశారు. భూసేకరణకు సంబంధించి సహకరించాలని కోరుతున్నానని వెల్లడించారు. భూములకు మార్కెట్ ధర ప్రకారం చెల్లింపులు చేస్తామన్నారు. అధికారులపై దాడులు చేయించి అభివృద్ధిని అడ్డుకోవద్దని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News