- Advertisement -
అమరావతి: ఓ మహిళను చంపి ఆమె శరీర భాగాలను బెడ్‌షీట్‌లో మూటకట్టి కల్వర్టు కిందపడేశారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లా కశింకోట మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బయ్యవరం గ్రామ శివారులో కల్వర్టు కింద ఓ బెడ్‌షీట్‌లో మాంసపు ముద్దులు, రక్తపు మరకలు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బెడ్‌షీట్‌ను పరిశీలించగా ఓ మహిళ చేయి, కాళ్లు ఉన్నట్టు గుర్తించారు. మృతురాలి వయసు 40 ఏళ్లు ఉంటాయని పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, వివిధ పోలీస్ స్టేషన్లలో మిస్సింగ్ కేసు వివరాలతో పాటు స్థానిక సిసి కెమెరాలను పరిశీలిస్తున్నామని సిఐ స్వామి నాయుడు పేర్కొన్నారు.
- Advertisement -