ఫ్రియదర్శి ప్రధాన పాత్రలో రామ్ జగదీశ్ దర్శకత్వంలో తెరకెక్కిన కొత్త చిత్రం ‘కోర్టు్’. ఈ నెల 14వ తేదీన విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌తో దూసుకుపోతుంది. విడుదలైన నాలుగో రోజుల ఈ సినిమా రికార్డుస్థాయిలో కలెక్షన్లు రాబట్టింది.విడుదలై తొలి రోజే ఈ సినిమాకు రూ.8కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. ఆ తర్వాత వీకెండ్ కావడంతో కలెక్షన్లు మరింత పెరిగాయి. మొత్తం నాలుగు రోజులకు రూ.28.9 కోట్లు రాబట్టిందని చిత్ర బృందం వెల్లడించింది.
ఇక ఈ సినిమా ఓవర్‌సీస్‌లో కూడా ఈ సినిమా మంచి వసూళ్లు చేస్తోంది. ఈ వారంతంలోనే 1 మిలియన్ డాలర్స్‌ను రాబట్టే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక సినిమాలో నటుడు శివాజీ కీలక పాత్రలో నటించారు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై హీరో నాని ఈ చిత్రాన్ని నిర్మించారు. చిన్న పిల్లల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన పోస్కో చట్టం గురించి ఈ సినిమాలో చూపించారు. కోర్టులో జరిగే డ్రామా అంతా ప్రేక్షకులను ఆకట్టుకుంది. పలు భావోద్వేగ సన్నివేశాలు కూడా కట్టిపడేస్థాయి.