- Advertisement -
హైదరాబాద్: బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి శంబిపూర్ రాజు, మంత్రి శ్రీధర్ బాబు మధ్య మాటల యుద్ధం నెలకొంది. శాసన మండలిలో ఎంఎల్‌సి శంబిపూర్ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం కడుతోంది ఫోర్త్ సిటీ కాదు అని, ఫోర్ బ్రదర్స్ సిటీ అని శంభీపూర్ రాజు అనడంతో శ్రీధర్ బాబు ఊగిపోయారు. సభలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని బాబు హితువు పలికారు. శాసన సభలో ఇంతకంటే దారుణంగా మాట్లాడుతున్నారని శంబిపూర్ వివరణ ఇచ్చారు. వేరే సభ విషయాలు ఈ సభలో అనవసరమని ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అనడంతో ఈ అంశం సద్దుమణిగింది.
- Advertisement -