Thursday, March 20, 2025

జనాభా ఆధారంగా రిజర్వేషన్లు: దామోదర

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ కట్టుబడి ఉందని మంత్రి దామోదర రాజ నర్సింహ తెలిపారు. కాంగ్రెస్ అధికారం లోకి వచ్చాక ఎస్సీ వర్గీకరణపై అనుకూలంగా ఉన్నామన్నారు. కుల వ్యవస్థ దేశాన్ని వీక్ చేస్తుందని గాంధీ చెప్పారని, ఎస్సీల్లోని నాలుగు గ్రూపులకు 15 శాతం రిజర్వేషన్లు లభించాయని చెప్పారు. శాసన సభలో దామోదర మాట్లాడారు. జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించామని, 1950 లో మళ్లీ 60 కులాలు వచ్చాయని, వర్గీకరణ కోసమే జస్టిస్ రామచంద్ర రాజు కమిషన్ ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. 24 గంటల్లోనే సదరు కమిషన్ నివేదికను ప్రభుత్వం ఆమోదించిందని తెలియజేశారు. అసెంబ్లీ చరిత్రలో ఇవాళ చారిత్రాత్మకమని, వివక్ష కారణంగానే సామాజిక ఉద్యమాలు పుట్టుకొచ్చాయని, ఎస్సి వర్గీకరణకు అనుకూలంగా వాదనలు వినిపించామని రాజ నర్సింహ వెల్లడించారు.

వర్గీకరణతో 3.43 శాతం జనాభాపై ప్రభావం పడిందని, 1975 లో 50కి పైగా కులాల విభజన జరిగిందని పేర్కొన్నారు. దళిత కులాలను నాలుగు గ్రూపులుగా విభజించాలని చెప్పిందని, అత్యల్ప అక్షరాస్యత బుడుగు జంగాల్లో ఉందన్నారు. మహనీయుల పోరాట ప్రతిఫలమే పూనా ఒప్పందం జరిగిందని, అణగారిన వర్గాలకు కావాల్సింది ప్రమాణాలతో కూడిన విద్య అని తెలియజేశారు. సుప్రీం కోర్టు తీర్పు తర్వాత వర్గీకరణపై సబ్ కమిటి ఏర్పాటు చేశామని, ఎస్ సి వర్గీకరణ ఏ కులానికి వ్యతిరేకం కాదని అన్నారు. అంబేద్కర్, పూలేలు సమానత్వం కోసం పోరాటం చేశారని వివరించారు. ఆత్మ గౌరవానికి మించింది ఏది లేదని అంబేద్కర్ చెప్పారని దామోదర స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News