Thursday, March 20, 2025

పిటిషనర్‌కు షాక్.. హైకోర్టు రూ.కోటి జరిమానా!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సాధారణంగా కోర్టు జరిమానా అంటే వేలల్లో ఉంటుంది. మరి ఎక్కువ అయితే.. అది లక్షల్లోకి ఉండే అవకాశం ఉంది. కానీ, కోర్టు కోటి రూపాయిలు జరిమానా విధించిందని వినడం చాలా అరుదు. అలాంటి సంఘటనే తెలంగాణ హైకోర్టులో చోటు చేసుకుంది. కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన పిటిషనర్‌కు కోర్టు ఏకంగా కోటి రూపాయిల జరిమానా విధించింది. హైకోర్టులో ఒక పిటిషన్ పెండింగ్‌లో ఉండగా.. మరో బెంచ్‌కు వెళ్లిన పిటిషనర్‌కు జస్టిస్ నగేశ్ భీమపాక షాక్ ఇచ్చారు. ఇలా చేసి కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినందుకు పిటిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన రూ.కోటి జరిమానా విధించారు. ఈ తీర్పుతో ఇది అత్యంత భారీ జరిమానాగా న్యాయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News