Thursday, March 20, 2025

అకౌంటెంట్ పై దాడి… బంధించిన సుచిర్ ఇండియా ఎండి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అకౌంట్ డబ్బులు మాయం కావడంతో అకౌంటెంట్ పై సుచిర్ ఎండి దాడి చేసి అనంతరం నిర్బంధించిన సంఘటన హైదరాబాద్ లోని  బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…  ప్రియాంక్ అనే వ్యక్తి సుచిర్ ఇండియా ఎండి కిరణ్ వద్ద రెండు నెలల నుంచి అకౌంటెంట్ గా పని చేస్తున్నాడు.  అకౌంట్ లో రూ.5 లక్షలు తేడా రావడంతో నందీనగర్ లోని తన ఆఫీసుకు ప్రియాంక్ ను పిలుచుకొని డబ్బులు ఏమయ్యాయని ప్రియాంక్ పై దాడి చేశాడు. అనంతరం ఓ గదిలో బంధించి కిరణ్ బయటకు వెళ్లాడు. ప్రియాంక్ 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. బంజారాహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితుడిని రక్షించాడు. ప్రియాంక్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News