- Advertisement -
న్యూయార్క్: డొమినికన్ రిపబ్లిక్‌లో అదృశ్యమైన భారత సంతతి విద్యార్థిని సుదీక్ష కోణంకి కేసు మిస్టరీగా మారింది. డొమినిక్ రిపబ్లిక్ పోలీసులు తమ కుమార్తె చనిపోయినట్లు ప్రకటించాలని ఆమె తల్లిదండ్రులు కోరినట్లు అమెరికా మీడియా సంస్థలు పేర్కొన్నాయి. సుదీక్ష కోణంకి పుంటా కానా పట్టణంలోని రియూ రిపబ్లిక్ రిసార్టులో చివరిసారిగా కనిపించింది. సుదీక్ష కనిపిచకుండా పోవడానికి ముందు యూనివర్సటీలో తన సీనియర్ అయిన 24 ఏళ్ల జాషువా స్టీవెన్ రిబేతో కలిసి బీచ్‌కు వెళ్లినట్లు అధికారులు గుర్తించి అతడిని ప్రశ్నిచారు. సుదీక్ష కోణంకి కనిపించకుండా పోయిన కేసులో ఎవరినీ అనుమానితులుగా గుర్తించలేదని, మిస్సింగ్ పర్సన్స్ కేసుగానే పరిగణిస్తున్నామని, క్రిమినల్ మ్యాటర్‌గా గుర్తించడంలేదని అమెరికా అధికారులు తెలిపారు.
- Advertisement -