Thursday, March 20, 2025

కల్కి-2పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రభాస్ హీరోగా మహాభారతం నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘కల్కి-2898 ఎడి’. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో భైరవ పాత్రలో ప్రభాస్ నటించగా.. సుమతిగా దీపికా పదుకొనే, అశ్వత్థామగా బిగ్‌బి అమితాబ్ బచ్చన్ నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లు రాబట్టింది ఈ సినిమా. దీంతో ఈ సినిమా సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని సినీ అభిమానులంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ‘కల్కి-2’ గురించి దర్శకుడు నాగ్ అశ్విన్ కీలక అప్‌డేట్ ఇచ్చారు.

‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమా రీ రిలీజ్ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నాగ్‌ అశ్విన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం సినిమా స్క్రిప్ట్ వర్క్ నడుస్తుందని.. అది పూర్తయిన వెంటనే షూటింగ్ మొదలుపెడతామని పేర్కొన్నారు. సెకండ్ పార్ట్‌లో భైరవ, కర్ణ పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. పార్ట్-1లో మహాభారతం నేపథ్యంలో సుమతీ, అశ్వత్థామ పాత్రలను డిజైన్ చేసుకొని ఇక్కడి వరకూ వచ్చామని.. పార్ట్-2లో ప్రభాస్‌ను ఎక్కువగా చూపిస్తామని నాగ్ అశ్విన్ పేర్కొన్నారు. సినిమా విడుదల తేదీని ఇంకా అనుకోలేదని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News