పదవీకాలం రెండు సంవత్సరాలు
సభ్యులకు ఎలాంటి జీతభత్యాలు
ఉండవు ఇఒగా ఐఎఎస్ అధికారి
అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన
మంత్రి కొండా సురేఖ
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర దేవాదా య శాఖ మంత్రి కొండా సురేఖ సాయం త్రం అసెంబ్లీలో యాదగిరిగుట్ట ట్రస్టుబోర్డు ఏర్పా టు బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 18 మందితో ట్రస్టు బోర్డు ఉంటుందని, బోర్డు పదవీకాలం రెండు సంవత్సరాలు ఉంటుందని తెలిపారు. సభ్యులకు ఎలాంటి జీతభత్యాలు ఉండవని వి వరించారు.వైటిడికి బడ్జెట్ ఆమోదం ప్రభు త్వం ద్వారానే జరుగుతుందని, ఐఎఎస్ అధికారి ఇఒగా వ్యవహరిస్తారని సురేఖ తెలిపా రు. తిరుమల తిరుపతి దేవస్థానం(టిటిడి) తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఉం టుందని వివరించారు. మహిళలకు ఉచిత బ స్సు సౌకర్యం అందుబాటులోకి వచ్చాక దేవాలయాలకు భక్తుల రద్దీ పెరిగిందని, ఆదాయం కూడా పెరిగిందని వాటి వివరాలను తెలియజేశారు. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా ఆలయాల్లో సౌకర్యాలు ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పా రు. సమర్థవంతమైన పాలకమండలి ఏర్పాటు చేయడం ద్వారా భక్తులకు మరింత సౌకర్యా లు కల్పించాలన్న లక్షంతో ట్రస్టు బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాటాడుతూ యాదగిరిగుట్టలో ఆలయం నిర్మాణం అయ్యింది, కాని భక్తులకు ఎలాంటి సదుపాయాలు చేయలేదని, పర్యవేక్షణ లోపం ఎంతో ఉందని, ప్రస్తుతం యాదగిరి గుట్ట వార్షిక ఆదాయం రూ.224కోట్ల మేరకు ఉందని వివరించారు. తన చిన్నతనంలోనే గుట్టలో 108 సత్రాలు ఉండేవి, అభివృద్ధి పేరిట సత్రాలు, షాపులు తొలగించారు. టిటిడి తరహాలో ట్రస్టుబోర్డు ఏర్పాటుచేస్తామనేది ఎంతో సాహసోపేత నిర్ణయంగా ఆయన అభివర్ణించారు. యాదగిరిగుట్ట టెంపుల్ సిటి కోసం 1,241 ఎకరాల స్థలం అందుబాటులో ఉంది. బోర్డు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బోర్డు వల్ల యాదగిరిగుట్ట ఎంతో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. 1,241 ఎకరాలు ఇచ్చారు, 110 మందికి షాపులు ఉండేవి, వాటిని తొలగించారు. అభివృద్ధి పేరిట కోల్పోయారు. కేవలం పది షాపులు మాత్రమే ఉన్నాయి. కనీసం వంద కార్లకు పార్కింగ్ సదుపాయంలేదు. సుమారు రెండువేల నుంచి ఐదు వేల కార్ల పార్కింగ్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. దాదాపు 360 మంది ఆటో కార్మికులు భక్తుల రవాణాకు సహకరిస్తున్నారు. రోప్ వే ఏర్పాటుచేసే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలించాలని కోరారు.
స్వాగతిస్తున్నాం ః ప్రశాంత్ రెడ్డి
యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటును తాము స్వాగతిస్తున్నామని శాసన సభలో బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పునర్నిర్మాణంలో తాను కూడాభాగస్వామ్యం కావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ప్రపంచంలోనే పూర్తి కృష్ణశిలతో నిర్మించిన ఏకైక దేవస్థానం యాదగిరి గుట్ట అని, మాజి సిఎం కెసిఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని ఆగమ శాస్త్ర ప్రకారం, పండితులతో అనేక సార్లు చర్చించి పునర్ నిర్మాణానికి పూనుకున్నారని చెప్పారు. నాడు కెసిఆర్ సూచనల మేరకు విమానగోపురం తాపడం కోసం అరవై కిలోల బంగారం సేకరించి పెట్టామని, తాను, తన వియ్యంకుడు కలిసి కిలో బంగారం, అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కొంత బంగారం ఇచ్చారని, కాంగ్రెస్ ప్రభుత్వం విమాన గోపురం ప్రారంభించడం అభినందనీయమని అన్నారు.
భద్రాచలం అభివృద్ధి చేయాలి
ఎంతో చరిత్రకలిగిన భద్రాచలం శ్రీరామచంద్రస్వామి ఆలయం అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. యాదగిరిగుట్ట ట్రస్టు బోర్డు ఏర్పాటుకు ఆయన మద్దతు ప్రకటిస్తూ ఎక్కడి ఆలయం ఆదాయం అక్కడే ఖర్చు చేస్తారా ? ప్రభుత్వ ఖజానాకు మళ్లిస్తారా అనే దానికి ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కోరారు. గత ప్రభుత్వంలో నాటి సిఎం కెసిఆర్ వంద కోట్లతో భద్రాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు, ఆచరణ రూపందాల్చలేదు, అతి పురాతనంగా, అభివృద్ధికి నోచుకోని ప్రాంతంగా భద్రాచలం ఉంది, యాదగిరిగుట్టకు ఇస్తున్న ప్రాధాన్యత, భద్రాచలంకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
సిఎం నిబద్దతకు నిదర్శనం
యాదగిరిగుట్ట అభివృద్ధి పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎంతో నిబద్దతతో పనిచేస్తున్నారని భువనగిరి ఎమ్మెల్యే కె.అనిల్‌కుమార్ రెడ్డి తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజును యాదగిరి గుట్ట పైన చేసుకున్నారు, అదే రోజు భీమాలింగేశ్వరస్వామికి పూజ చేసి మూసీ ప్రక్షళనకు శ్రీకారం చుట్టారని, అదే రోజున యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటుకు అంకురార్పణ జరిగిందని వివరించారు.
మెడికల్ కాలేజి ప్రతిపాదించాలి ః హరీష్‌రావు
యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిలో భాగంగా ఒక మెడికల్ కాలేజిని ఏర్పాటుచేయాలని బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు సూచించారు. యాదగిరిగుట్ట దేవాలయ బోర్డు ఏర్పాటు బిల్లు పై శాసన సభలో ఆయన మాట్లాడుతూ ఈ బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి గారిని, బిల్లును రూపొందించిన అధికారులను మనస్పూర్తిగా అభినందిస్తున్నట్లు చెబుతూ ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. మాజి సిఎం కెసిఆర్ దాదాపు రెండువేల కోట్ల వ్యయంతో దేవాలయాన్ని నిర్మించారు. వెయ్యి సంవత్సరాల కోసం ఆలోచించి దేవాలయాన్ని అభివృద్ధి చేశారని తెలిపారు. ట్రస్టు బోర్డు లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీని కూడా విధిగా పెట్టాలని, ఒక ఎస్టీ సభ్యుడికి అవకాశం ఇవ్వాలని సూచించారు. తిరుపతిలో ధర్మకర్తల మండలి మాదిరిగా యాదగిరిగుట్ట ధర్మకర్తల మండలిగా మార్చాలని హరీష్‌రావు కోరారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడకు కూడా ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.