దళితులకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా
ఉంటుంది వర్గీకరణ బిల్లు ద్వారా మా చిత్తశుద్ధిని
చాటుకున్నాం దశాబ్దాల సమస్యకు శాశ్వత
పరిష్కారం చూపాం వర్గీకరణ పోరాటంలో అమరులైన వారి కుటుంబాలకు ప్రభుత్వ పథకాల్లో
ప్రాధాన్యం జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెరగాలి అసెంబ్లీలో సిఎం రేవంత్‌రెడ్డి
ముఖ్యమంత్రి పట్టుదల వల్లే ఇది సాధ్యమైంది, చిత్తశుద్ధితో చేశాం : మంత్రులు దామోదర, ఉత్తమ్
మన తెలంగాణ / హైదరాబాద్ :రాష్ట్ర ప్ర భుత్వం ప్రతిష్టాత్మకరంగా తీసుకున్న ఎ స్సీ వర్గీకరణ బిల్లును మంగళవారం శా సనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. మూడు దశాబ్దాలకు పైగా ఎస్సీ వర్గకరణ సమస్య పరిష్కారం కోసం ఎదురుచూస్తు న్న ఈ వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన త న హామీని నిలబెట్టుకుంది. ఎస్సీ వర్గీకరణ బిల్లును ఉదయం వైద్య ఆరోగ్యాశాఖ మంత్రి దామోదర రాజనరసింహ సభలో ప్రవేశపెట్టగా సాయంత్రం దీనిని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ షెడ్యూల్డు కులాల వర్గీకరణ న్యాయమైన అంశమని, దళితుల కు కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అండగా ఉం టుందని ఈ బిల్లు ద్వారా తమ చిత్తశుద్దిని చాటుకున్నామన్నారు. సుదీర్ఘమైన ఎస్పీవర్గీకరణ పోరాటంలో ఎంతో మంది ప్రా ణాలు కోల్పోయారని, ఎన్నో ఏండ్ల ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్న చా రిత్రాత్మకమైన సందర్భమని సిఎం పేర్కొన్నారు.
దళితులకు తమ కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం అండగా ఉంటూ వారి అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 1960 లోనే దామోదరం సంజీవయ్య లాంటి దళితున్ని ముఖ్యమంత్రిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని, అలాగే మల్లికార్జున ఖర్గేను ఏఐసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ చేసిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సుప్రీంకోర్టు దర్మాసనం ముందు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ప్రభుత్వవాదనలను బలంగా వాదనలు వినిపించామని, తీర్పు వచ్చిన కొద్దిగంటల్లోనే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగానే శాసనసభలో తీర్మాణం చేసి నిబద్దతను చాటుకున్నామని సిఎం రేవంత్ రెడ్డి వివరించారు. సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయడంతో పాటు న్యాయనిపుణులను సంప్రదించి జస్టీస్ షమీమ్ అక్తర్ ఏకసభ్య కమిషన్ ను ఏర్పాటు చేశామన్నారు. కమిషన్ ఇచ్చిన నివేదికను యధావిధిగా ఆమోదించినట్లు తెలిపారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎస్పీ వర్గీకరణ అంశానికి చట్టబద్దత కల్పించడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు.
షెడ్యూల్డు కులాల్లో ఉన్న 59 ఉప కులాలను మూడు గ్రూపులుగా కమిషన్ విభజించిందని, అందులో ఒక శాతం జనాభాకలిగిన 15 కులాలను గ్రూప్ 1 కింద, తొమ్మిది శాతం జనాభా ఉన్న 18 కులాలను గ్రూప్ 2 కింద, ఐదు శాతం జనాభా కలిగిన 26 కులాలను గ్రూప్ 3 గా విభజించి మొత్తం 15 శాతం రిజర్వేషన్లను పొందుపరిచినట్లు బిల్లులోని ప్రధాన అంశాలను ముఖ్యమంత్రి వివరించారు. సుధీర్ఘకాలంపాటు ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలను తెలంగాణ ఉద్యమకారుల మాదిరిగా బాధ్యతతో ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుందని ముఖ్యమంత్రి హామీఇచ్చారు. వారి కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం పథకాల్లో ప్రాధాన్యం కల్పిస్తామని సభలో ప్రకటించారు. ఎస్సీలకు 18 శాతం రిజర్వేషన్ల పెంచాలన్న ఎమ్మెల్యే వివేక్ ప్రతిపాదనను సిఎం రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తూ జనాభాదామాషా ప్రకారంగా రిజర్వేషన్లు పెరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయని, 2026 జనగణన పూర్తి కాగానే అందులో వచ్చే లెక్కల ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతామని వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదానికి సహకరించిన సభ్యులందరికీ ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు.
వర్గీకరణ బిల్లు&
శాసనసభలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు అన్ని రాజకీయపక్షాలు మద్దతుతెలిపాయి. ఈ బిల్లును దళిత సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ఉద్యమం మొదలై దాదాపు ముప్పై ఏండ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎస్పీవర్గీకరణకు చట్టబద్దత కల్పించిందని, వారు ప్రశంసించారు.