మేషం -మారుతున్న కాలానికి అనుగుణంగా మీరు ప్రవర్తించలేక పోతారు.ఆర్థికస్థితి మెరుగ్గా ఉంటుంది. అత్యంత ఆప్తులనీ మీరు భావించిన వారితో అభిప్రాయ బేధాలు చోటు చేసుకునే అవకాశం వుంది.
వృషభం -మీ శక్తి సామర్థ్యాలు మీ కన్నా ఇతరులకు ఎక్కువగా ఉపయోగపడతాయి. ఆలోచనలను ఒక దారికి తీసుకువస్తారు. ఖర్చు అధికంగా ఉన్నా, సంతానపరమైన పురోభివృద్ధి బాగుంటుంది.
మిథునం -మిత్రుల వలన మేలు జరుగుతుంది. డాక్టర్ల సలహాలు సూచనలు అనుకూలిస్తాయి. గుడ్ విల్ ని మరింతగా పెంపొందించుకుంటారు. ప్రతి విషయంలో మెలకువతో వ్యవహరించడం చెప్పదగినది.
కర్కాటకం -అదృష్టాన్ని ఎక్కువగా నమ్ముతారు. అలాగని చేతులు కట్టుకొని ఊరికే కూర్చోరు. ప్రింటింగ్, స్టేషనరీ వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా కొంత గోప్యత అవసరమని గ్రహించాలి.
సింహం -భాగస్వాములతో అభిప్రాయ భేదాలు చోటుచేసుకుంటాయి. ముఖ్యమైన వ్యవహారాల వలన మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి.
కన్య -ఆత్మీయులతో ఏర్పడిన అంతర్గత విభేదాలు తలనొప్పిగా పరిణమిస్తాయి. ఆర్థిక లావాదేవిలు కొంత ఊరట కలిగిస్తాయి. దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు.
తుల -జీవిత భాగస్వామి నుండి ధన లాభం పొందుతారు. ఉద్యోగాలలో స్థానచలనం ఉంటుంది. శత్రువులు సమస్యలు సృష్టించినా అధిగమిస్తారు.దైవ దర్శనం మానసిక ఉల్లాసంకి కారణం అవుతుంది.
వృశ్చికం -నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వృత్తి- వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి.
ధనుస్సు – కళా, పారిశ్రామిక రంగాలలోని వారికి కొంత అనుకూలంగా ఉంటుంది. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండటం మంచిది. స్వల్ప ధన లాభం గోచరిస్తుంది.
మకరం -ఆర్థిక అభివృద్ధి అనుకున స్థాయిలో ఉండదు.ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. పై అధికారుల నిందలు కొంతమేర ఇబ్బంది పెడతాయి.ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
కుంభం -బంధుత్వ ఆపేక్షల కన్నా ధనానికే ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తున్న వర్గం వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఆర్థిక స్థితి బాగుంటుంది. నిశ్చింతగా వ్యవహరిస్తారు.
మీనం -కుటుంబంలో భేదాభిప్రాయాలు చోటుచేసుకునే సూచనలు ఉన్నాయి.జాగ్రత్త వహించండి.బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది. కొంత మానసిక ప్రశాంతత లోపిస్తుంది.