Thursday, March 20, 2025

భూమికి చేరిన సునీతా, విల్మోర్

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: భూమి మీదకు సునీతా విలియమ్స్, విల్మోర్ సురక్షితంగా అడుగుపెట్టారు. బుధవారం తెల్లవారుజామున ఉదయం 3.27 గంటలకు క్రూ డ్రాగన్ వ్యోమనౌక ఫ్లోరిడాలోని సముద్ర తీరంలో దిగింది. సునీతా విలియమ్స్ 9 నెలల తర్వాత అంతరిక్షం నుంచి భూమ్మీద చేరుకున్నారు. క్రూ డ్రాగన్ వ్యామనౌక ల్యాండింగ్ సక్సెస్ తో నాసా శాస్త్రవేత్తల సంబరాలు చేసుకున్నారు. సునీతా, విల్మోర్ లతో పాటు నాసాకు చెందిన కమాండర్ నిక్ హేగ్, రష్యా వ్యోమగామి అలగ్జెండర్ గుర్బునోవ్ అంతరిక్షం నుంచి భూమి మీదకు చేరుకున్నారు.

2024 జూన్ 5న స్టార్ లైనర్ వ్యోమనౌకలో సునీత, విల్మోర్ అంతరిక్షానికి వెళ్లారు. ఆ సమయంలో వారం రోజుల్లో తిరిగి రావాల్సి ఉన్న సాంకేతిక సమస్యతో గతంలో వ్యోమనౌక స్టార్ లైనర్ ఖాళీగా తిరిగొచ్చింది. సునీత, బుచ్ విల్మోర్ 288 రోజులు అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు. సునీత మూడో అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేశారు. 2006, 2012లోనూ అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేసిన ఘనత ఆమెకే దక్కుతుంది.

Sunita Williams and Butch Wilmore return to Earth

వ్యోమగాములు సురక్షితంగా, ఆరోగ్యంగా ఉన్నారని నాసా ప్రకటించింది. ప్రశాంత వాతావరణం వల్ల డ్రాగన్ క్యాప్సూల్స్, ల్యాండింగ్ ఇబ్బంది కాలేదని వివరించింది. ల్యాండింగ్ సమయంలో భద్రతాపరంగా అమెరికా కోస్ట్ గార్డ్ అన్ని చర్యలు తీసుకుందని, అన్ డాకింగ్ నుంచి సాఫ్ట్ ల్యాండింగ్ వరకు అన్నీ అనుకున్నట్లు జరిగాయని సంతోషం వ్యక్తం చేసింది. స్పెస్ ఎక్స్ సంస్థ ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యతో శక్తిని చాటిందని కొనియాడింది.  భవిష్యత్ అంతరిక్ష ప్రయోగాలు, ప్రైవేట్ భాగస్వామ్యాలకు ఇదో సరికొత్త పద్దతి నాంది పలికిందని మెచ్చుకుంది. క్యూ-9 వ్యోమగాములు 150కి పైగా ప్రయోగాలు నిర్వహించారని, క్యాన్సర్లకు పరిష్కారాలు చూపే మార్గాలపైనా పరిశోధనలు చేశారని పేర్కొంది. వ్యోమగాముల కృషి, పరిశోధనలు భవిష్యత్ కు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని వెల్లడించింది.

Sunita Williams and Butch Wilmore return to Earth

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News