Thursday, March 20, 2025

ఇంట్లో సిసి కెమెరాలు పెట్టిన భర్త…. కన్నబిడ్డను చంపిన కసాయితల్లి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఇంట్లో సిసి కెమెరాలు పెట్టి భర్త అనుమానిస్తుండడంతో భార్య తన కన్నబిడ్డను చంపింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా పెదగదిలి కొండవాలు ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. పెదగదిలి కొండవాలు ప్రాంతంలో వెంకటరమణ, శిరీష అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులు 12 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరికి ఐదు నెలల క్రితం ఒక పాప జన్మించింది. గత కొన్ని సంవత్సరాల నుంచి భార్యకు వివాహేతర సంబంధం ఉందని పలుమార్లు ఆమె వేధించాడు. ఆమె వేధించడంతో ఇంట్లో సిసి కెమెరాలు కూడా అమర్చాడు. వేధింపులు ఎక్కువ కావడంతో పాప ముఖంపై దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేసింది.

ఎవరికీ అనుమానం రాకుండా సముద్ర తీరానికి వెళ్లింది. పాప మృతదేహంతో నీటిలోకి వెళ్లింది.. కొంచెం సేపు నీటి ఉండిన తరువాత తన భర్తకు ఫోన్ చేసి… సముద్రంలో కెరటాలు ఎక్కువగా రావడంతో పాప నీటిలో మునిగిపోయిందని తెలిపింది. పాప కళ్లు తెరవడంలేదని రోదిస్తూ భర్తకు భార్య చెప్పింది. భార్యపై అనుమానం రావడంతో వెంకటరమణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి పాప మృతదేహాన్ని శవ పరీక్షకు తరలించారు. పోస్టుమార్టమ్ రిపోర్టులో ఊపిరాడకపోవడంతోనే పాప మృతి చెందినట్టు తేలడంతో భార్యను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. పాపను తానే హత్య చేశానని ఒప్పుకోవడంతో వెంటనే ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News