Thursday, March 20, 2025

తెలంగాణ బడ్జెట్ @ రూ.3,04,965 కోట్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక శాఖ, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీ ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన శాసన సభలో మాట్లాడారు. సంక్షేమం, అభివృద్ధి ఈ ప్రభుత్వానికి జోడు గుర్రాల అని, అధికార పీఠం హోదాగా భావించడం లేదని స్పష్టంచేశారు. దశాబ్దకాలం పాలన వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని మండిపడ్డారు. నిరాధార ఆరోపణలు చేయడమే కొందరు పనిగా పెట్టుకున్నారని చురకలంటించారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో సవాళ్లను అధిగమించామని, అంబేద్కర్ సూచించిన నైతిక విలువలు పాటిస్తూ ప్రజాపాలన సాగిస్తున్నామని, ప్రజల కోసం బాధ్యతగా వ్యవహరిస్తున్నామని భట్టి తెలియజేశారు.

ప్రస్తుత ధరల ప్రకారం జిఎస్‌డిపి రూ.16,12,579 కోట్లు గా ఉందని వెల్లడించారు. గత సంవత్సరంతో పోలిస్తే వృద్ధిరేటు 10.1 శాతం నమోదైందని ప్రకటించారు. జిఎస్‌డిపి వృద్ధిరేటు జిడిపి వృద్ధిరేటు కంటే ఎక్కువగా ఉందన్నారు. జిఎస్‌డిపి వృద్ధిరేటు 10.1 శాతం, జిడిపి వృద్ధి రేటు 9.9 శాతం, దేశ జిడిపి 3,31,03,2015 కోట్లుగా ఉందని, 2024-25 ఏడాది తలసరి ఆదాయం రూ.3,79, 751 కోట్లుగా ఉందని, తెలంగాణ తలసరి ఆదాయ వృద్ధి రేటు 9.6 శాతంగా పెరిగిందన్నారు. దేశ తలసరి ఆదాయం రూ.2,05,579 కోట్లుగా ఉందని భట్టి వివరించారు.

దేశ తలసరి ఆదాయ వృద్ధిరేటు 8.8 శాతంగా పెరిగిందన్నారు. బడ్జెట్‌లో ప్రతిపాదించిన రుణాలు రూ.69,639 కోట్లుగా ఉందన్నారు. జిఎస్‌డిపిలో అప్పుల శాతం 28.1 శాతంగా ఉందని అంచనా వేశారు. ఉచిత ప్రయాణం ద్వారా మహిళలకు రూ.5006 కోట్లు ఆదా అయ్యిందని, ఉచిత బస్సు సౌకర్యంతో ఆర్‌టిసి ఆక్యుపెన్సీ రెషియో 94 శాతానికి పెరిగిందన్నారు. రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకం ద్వారా 43 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరిందని, సిలిండర్ల రాయితీ కింద రూ.433 కోట్లు చెల్లించామన్నారు. గృహజ్యోతి పథకం ద్వారా 50 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరిందని, గృహజ్యోతి పథకం కోసం రూ.1775 కోట్లు రాయితీ ఇచ్చామని భట్టి వెల్లడించారు. 6 గ్యారెంటీల అమలుకు రూ.56,084 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. మహాలక్ష్మి పథకానికి రూ.4,305 కోట్లు, గృహజ్యోతి పథకానికి రూ.2,080 కోట్లు, సన్న బియ్యం బోనస్‌కు రూ.1800 కోట్లు, రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకానికి రూ.1,143 కోట్లు, గ్యాస్ సిలిండర్ సబ్సిడీకి రూ.723 కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు రూ.600 కోట్లు ఖర్చు చేస్తామని భట్టి ప్రకటించారు.

రాష్ట్ర బడ్జెట్: రూ.3,04,965 కోట్లు
రెవెన్యూ మూలధనం: 2,26,982 కోట్లు
మూలధన వ్యయం: రూ.36,504 కోట్లు

రాష్ట్ర సొంత పన్నుల రాబడి: రూ.1,45,419 కోట్లు
కేంద్రపన్నుల వాటా: రూ.29,899 కోట్లు
పన్నేతర ఆదాయం: రూ.31,618 కోట్లు
కేంద్రం నుంచి గ్రాంట్లు: రూ.22,782 కోట్లు
అప్పులు అంచనా: రూ.5,04,814 కోట్లు
స్టాంపుల, రిజిస్ట్రేషన్ల ఆదాయం: రూ.19087 కోట్లు
ఎక్సైజ్ శాఖ ఆదాయం: రూ.27,623 కోట్లు
అమ్మకం పన్ను ఆదాయం: రూ.37,463 కోట్లు
వాహనాలపై పన్ను ఆదాయం: రూ.8535 కోట్లు
కేటాయింపులు:
ఎస్‌సి సంక్షేమం: రూ.40,232 కోట్లు
పంచాయతీరాజ్ శాఖ: రూ.31,605 కోట్లు
వ్యవసాయ శాఖ : రూ.24,439 కోట్లు
నీటి పారుదల శాఖ: రూ.23,373 కోట్లు
విద్యారంగం: రూ.23,108 కోట్లు
విద్యుత్ రంగం: రూ.21,221 కోట్లు
పురపాలక సంఘం: రూ.17,677 కోట్లు
ఎస్‌టి సంక్షేమం: రూ.17,169 కోట్లు
వైద్య రంగం: రూ.12,393 కోట్లు
బిసి సంక్షేమం: రూ.11,405 కోట్లు
హోంశాఖ: రూ.10,188 కోట్లు

రహదారుల, భవనాల శాఖ: రూ.5,907 కోట్లు
మైనార్టీ సంక్షేమం: రూ.3,591 కోట్లు
పరిశ్రమలు: రూ.3,527 కోట్లు
మహిళా శిశుసంక్షేమ శాఖ: రూ.2,862 కోట్లు
అటవీ, పర్యావరణం: రూ.1063 కోట్లు

పశుసంవర్థక శాఖ: రూ.1674 కోట్లు
పౌరసరఫరాలు: రూ.5734 కోట్లు
కార్మిక శాఖ: రూ.900 కోట్లు
పర్యాటక రంగం: రూ.775 కోట్లు
ఐటి రంగం: రూ.774 కోట్లు
క్రీడలు: రూ.465 కోట్లు
చేనేత రంగం: రూ.371 కోట్లు
దేవాదాయ శాఖ: రూ.190 కోట్లు

 

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News