Thursday, March 20, 2025

అప్పుడు విరాట్‌తో కలిసి.. ఇప్పుడు ఐపిఎల్ అంపైర్‌గా

- Advertisement -
- Advertisement -

2008లో జరిగిన అండర్-19 ప్రపంచకప్‌ను భారత్ దక్కించుకుంది. ఈ టోర్నమెంట్‌లో టీం ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ భారత్ జట్టుకు కెప్టెన్‌గా ఉండగా.. మరో స్టార్ ఆటగాడు రవీంద్ర జడేజా కూడా ఈ జట్టులో సభ్యుడే. అయితే ఈ టీంలో ఆడిన ఓ ఆటగాడు ఇప్పుడు ఐపిఎల్‌కు అంపైర్‌గా రానున్నాడు. 2008 అండర్-19 ప్రపంచకప్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన తన్మయ్ శ్రీవాస్తవ ఇప్పుడు ఐపిఎల్‌కు అంపైర్‌గా రానున్నాడు.

తన్మయ్ శ్రీవాస్తవ సొంత రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన క్రికెట్ అసోసియేషన్ ఈ విషయాన్ని వెల్డడించింది, ‘నిజమైన ఆటగాడు ఎప్పుడు మైదానం విడిచిపెట్టడు. అతని పాత్ర మాత్రమే మారింది. ఈ కొత్త ప్రయాణంలో తన్మయ్‌కి ఆల్ ది బెస్ట్’’ అంటూ ఉత్తర్‌ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. అండర్‌-19 జట్టులో అద్భుత ప్రదర్శన చేసినా.. అతనికి పెద్దగా అవకాశాలు రాలేదు. 2008-12 వరకూ ఐపిఎల్‌లో ఆడిన అతను 7 మ్యాచుల్లో 8 పరుగులు మాత్రమే చేశాడు. డొమెస్టిక్ క్రికెట్‌లో 90 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, 44 లిస్ట్-ఎ, 34 టి-20లు ఆడి 7వేలకు పైగా పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు, 81 హాఫ్ సెంచరీుల ఉన్నాయి. ఐదేళ్ల క్రితం ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చిన తన్మయ్.. దేశవాలీ క్రికెట్‌లో అంపైర్‌గా వ్యవహరిస్తున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News