- Advertisement -
ఈ బడ్జెట్ చేదు, తీపీ కలగలుపు ఉగాది పచ్చడిగా ఉంది. బడ్జెట్ పై ప్రజల్లో అనేక ఆశలు ఉన్నాయి. వాటిని నెరవేర్చే మార్గం చూపే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాకుం డా, అప్పుల పై ఆధారపడి రాష్ట్రాన్ని నడ పాలి అంటే సాధ్యం కాదు. అన్ని చేయాలి అంటే అల్లాద్దీన్ అద్భుత దీపం కావాలి. ఎన్నికల్లో పోటీలు పడి వాగ్దానం చేశారు. ఇచ్చిన హామీలు అన్ని అమలు చేయాలంటే రూ. 5 లక్షల కోట్ల బడ్జెట్ కూడా సరిపోదు. ఉన్నంతలో ప్రాక్టికల్‌గా బడ్జెట్ పెట్టారు. గొప్పలకు పెంచి పెట్టలేదు.
సిపిఐ శాసనసభా పక్ష నేత కూనంనేని సాంబశివరావు
- Advertisement -