- Advertisement -
జైపూర్: రాజస్థాన్ రాష్ట్రం బికనూర్ జిల్లాలో దేశ్‌నాక్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు అదుపు తప్పి కారుపై బోల్తా పడడంతో ఆరుగురు ఘటనా స్థలంలోనే చనిపోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, రెస్కూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కారుపై పడిన ట్రక్కు క్రేన్ సహాయంతో పక్కకు తీశారు. కారులోని మృతదేహాలను బయటకు తీసి స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌డిఒ కవితా గోదారా తెలిపారు.
- Advertisement -