హైదరాబాద్: ఫార్మాసిటీ పేరును ఫ్యూచర్ సిటీగా మార్చి తిరిగి భూములు లాక్కుంటున్నారని కాంగ్రెస్ ప్రభత్వంపై బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్ రావు విమర్శలు గుప్పించారు. గతంలో నిరర్థక ఆస్తులు అమ్మితే ఎలా విక్రయిస్తారని ప్రశ్నించారని, ఇవాళ రూ.30 వేల కోట్ల విలువైన భూములు అమ్మకానికి పెట్టారని, రుణమాఫీ కోసం రూ.31 వేల కోట్లు సమీకరించుకన్నట్లు గత బడ్జెట్‌లో చెప్పారని గుర్తు చేశారు. బడ్జెట్‌పై శాసన సభలో సాధారణ చర్చ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. శాసన సభకు బడ్జెట్ అమోదం ముఖ్యమని కార్యక్రమమని, ప్రభుత్వానికి సహనశీలత, ఓపిక ఉండాలని, ప్రసంగం మధ్యలో మంత్రులు జోక్యం చేసుకోకుండా చూడాలని స్పీకర్‌ను హరీష్ రావు కోరారు.
గతేడాది ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని, రూ.2.91 లక్షల కోట్లతో గత బడ్జెట్ ప్రవేశపెట్టారని, అవాస్తవిక అంచనాలతో గత బడ్జెట్ ప్రవేశ పెట్టారని చెప్పానని గుర్తు చేశారు. రివైజ్డ్ ఎస్టిమేట్‌లో రూ.27 వేల కోట్లు తక్కువ చేసి చూపారన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముంపదు మార్కు పేరిట వాగ్దానాలు ఇచ్చారని, ఇప్పుడు ఆ వాగ్దానాలు ఏమయ్యాయయని చురకలంటించారు. ఎన్నికల ముందు నో ఎల్‌ఆర్‌ఎస్, నో బిఆర్‌ఎస్ అన్నారని, ఎన్నికల ముందు ఉచితంగా ఎల్‌ఆర్‌ఎస్ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ఇవాళ ఎల్‌ఆర్‌ఎస్ కోసం ముక్కు పిండి వసూలు చేస్తున్నారని హరీష్ రావు దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వెనక్కి ఇచ్చేది పోయి మళ్లీ లాక్కుంటామని చెబుతున్నారని ధ్వజమెత్తారు.