హైదరాబాద్: గతంలో కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. కమీషన్లకు కక్కుర్తి పడి ఔటర్ రింగ్‌రోడ్డుకు రూ.73000 కోట్లకు అమ్మారని దుయ్యబట్టారు. బడ్జెట్‌పై శాసన సభలో సాధారణ చర్చ సందర్భంగా హరీష్ రావుకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రీకౌంటర్ ఇచ్చారు. గతంలో మద్యం దుకాణాల గడువుకు మూడు నెలల ముందే దరఖాస్తులు తీసుకున్నారని, నిరుద్యోగుల వద్ద నాన్ రిపండబుల్ ఫండ్ కింద రెండు వేల కోట్లు వసూలు చేశారని, కోకాపేటలో భూములు వేలం వేసిన చరిత్ర బిఆర్‌ఎస్‌ది కాదా? అని చురకలంటించారు. ‘భూముల గురించి హరీష్‌రావు మాట్లాడడం హాస్యస్పదంగా ఉంది, హరీష్‌రావును ముందుపెట్టి మాట్లాడిస్తున్నారు, వెనక నుంచి హరీష్‌రావును ఇద్దరు, ముగ్గురు నడిపిస్తున్నారు, హరీష్‌రావుకు మొత్తం తెలియదు, మీ చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి’ అని కోమటిరెడ్డి సూచించారు.
భూముల గురించి హరీష్‌రావు మాట్లాడడం హాస్యస్పదం: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- Advertisement -
- Advertisement -
- Advertisement -