Saturday, March 22, 2025

పాలన అంటే అడ్డగోలుగా బొక్కేయడం కాదు: బాలూ నాయక్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు వంటి వ్యక్తులు కూడా ఇన్ని అబద్ధాలు చెబుతారనుకోలేదని ఎమ్మెల్యే బాలూ నాయక్ అన్నారు. హరీష్ రావు ప్రసంగం వాస్తవాలకు దూరంగా ఉందని తెలిపారు. బడ్జెట్‌పై శాసన సభలో సాధారణ చర్చ సందర్భంగా బాలూ నాయక్ మాట్లాడారు. ‘ పాలన అంటే గతంలో ప్రాజెక్టుల పేరుతో అడ్డగోలుగా బొక్కేయడం కాదు, అధికారం అడ్డుపెట్టుకుని ప్రభుత్వ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కాదు,  పరీక్ష పేపర్ల లీకేజీ ద్వారా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాలకులు అడ్డగోలు సంపాదన కేంద్రాలుగా మార్చడం కాదు, పరివారానికి, సంతానానికి లిక్కర్ స్కాముల విద్య నేర్పడం కాదు’ అని విమర్శలు గుప్పించారు. గతంలో మహిళలను మీటింగ్ లకు వాడుకోవడం తప్ప అభివృద్ధి చేయలేదని బాలూ నాయక్ చురకలంటించారు.

గతంలో ఆర్జీసీ సిబ్బంది నిరసనలు తెలిపితే ఉద్యోగాలు తొలగించారని గుర్తు చేశారు. మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం వెళ్తోందని, గతంలో పండుగలకు పంపిణీ చేసిన చీరలు పొలాలకు పరదాలుగా ఉన్నాయని ఆరోపించారు. నాణ్యత లేని చీరలు పంపిణీ చేసి మహిళలను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపిఎ ప్రభుత్వ హయాంలో రూ.400కే గ్యాస్ సిలిండర్ పంపిణీ జరిగిందని వెల్లడించారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు సిలిండర్ ధరను రూ. 1,250 పెంచారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రూ. 500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని పేర్కొన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ అనేది వైఎస్ఆర్ హయాంలోనే మొదలైందని స్పష్టం చేశారు. బిఆర్ఎస్ హయాంలోనే ఉచిత విద్యుత్ అమలు చేసినట్లు అవాస్తవాలు చెబుతున్నారని బాలూ నాయక్ దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News