న్యూఢిల్లీ : ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి నివాసంలో భారీ ఎత్తున నగదు కట్టలు బహిర్గతమైన తరువాత ఆయన బదలీకి సుప్రీం కోర్టు చర్యలు తీసుకుంటుండడంతో కాంగ్రెస్ స్పందిస్తూ, కేవలం బదలీ ద్వారా వివాదాన్ని కప్పిపుచ్చజాలరని శుక్రవారం వ్యాఖ్యానించింది. న్యాయవ్యవస్థ పట్ల దేశం విశ్వాసాన్ని పరిరక్షించేందుకు అది ఎవరి డబ్బో కనుగొనడం ముఖ్యం అని పార్టీ స్పష్టం చేసింది. జడ్జి ఇంటిలో నుంచి అంత భారీ మొత్తంలో నగదు బహిర్గతం కావదం అత్యంత తీవ్ర విషయమని, ఆయనను బదలీ చేయడం ద్వారా దీనిని కప్పిపుచ్చజాలరని కాంగ్రెస్ మీడియా, పబ్లిసిటీ విభాగం అధిపతి పవన్ ఖేరా అన్నారు. ‘జస్టిస్ వర్మ ఉన్నావ్ రేప్ కేసు, అనేక ఇతర తీవ్ర కేసులను విచారిస్తున్నారు. న్యాయవ్యవస్థపై దేశం విశ్వాసాన్ని నిలబెట్టేందుకు అది ఎవరి డబ్బో, దానిని ఎందుకు జడ్జికి ఇచ్చారో నిర్ధారించడం ప్రధానం’ అని ఖేరా ‘ఎక్స్’ హిందీ పోస్ట్‌లో పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎంపి మనీష్ తివారి విలేకరులతో మాట్లాడుతూ, సుప్రీం కోర్టు కొలీజియం ఏమి నిర్ణయిస్తుందో వేచి చూద్దామని అన్నారు.
జడ్జి బదలీతో వివాదాన్ని కప్పిపుచ్చలేరు: కాంగ్రెస్
- Advertisement -
- Advertisement -
- Advertisement -