న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ శనివారం నుంచి ప్రారంభంకానుంది. ఇప్పటికే ఈ టోర్నమెంట్ కోసం అన్ని జట్లు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మాత్రం టోర్నమెంట్‌కి ముందు ఊహించని షాక్ తగిలింది. జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ కెఎల్ రాహుల్.. తొలి రెండు మ్యాచ్‌లకు జట్టుకు దూరం కానున్నాడు. అందుకు అతని భార్య అతియా శెట్టి మొదటి బిడ్డకు జన్మనివ్వనుండటమే కారణం.
ఈ విషయాన్ని ఢిల్లీ మహిళ జట్టు కెప్టెన్ అలీసా హిలీ వెల్లడించారు. కెఎల్ రాహుల్ మొదటి రెండు మ్యాచ్‌లకు దూరం అవుతున్నాడని.. అతను తండ్రి కాబోతుండమే అందుకు కారణం అని హిలీ పేర్కొన్నారు. జట్టు బలంగా ఉన్నప్పటికీ.. రాహుల్ లేకపోవడం లోటే అని.. అతని ఆట తీరు అద్భుతంగా ఉంటుందని అన్నారు. ఐపిఎల్ మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రాహుల్‌ని 12 కోట్లకు కొనుగోలు చేసుకుంది. ఈ సీజన్‌లో ఢిల్లీ జట్టు తొలి మ్యాచ్ లక్నో సూపర్‌జెయింట్స్‌తో ఆడనుంది. ఆ తర్వాతి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్‌లకు కెఎల్ రాహుల్ దూరం కానున్నాడు.