Saturday, March 22, 2025

‘ఇది కష్టమే కానీ ఆసక్తికరం’.. ఎస్ఎస్ఎంబి29పై కీరవాణి

- Advertisement -
- Advertisement -

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళీ కాంబినేషన్‌లో ఓ భారీ యాక్షన్ అడ్వెంచర్ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఎస్ఎస్ఎంబి29 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా ఇటీవలే ఒడిశాలో ఓ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమాకు సంగీతం అందించడంపై ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకూ తాను చేసిన సినిమాల్లో ఇదే కష్టమైనది అని కీరవాణి అన్నారు.‘నా టూర్ ఎంఎంకె’ పేరిట ఈ నెల 22న తాను నిర్వహించనున్న కాన్సర్ట్‌ ప్రమోషన్స్‌లో భాగంగా పలు విషయాలను ఆయన పంచుకున్నారు. ‘ప్రతి సినిమాకీ సవాళ్లు పెరుగుతుంటాయి. దానికి తగినట్లు మ్యూజిక్ సృష్టించాలి. ఇలాంటి సినిమా మునుపెన్నడూ చేయలేదు. ఇది ఒక అడ్వెంచర్ కానీ.. ఆసక్తికరమైనది’ అని ఎస్‌ఎస్ఎంబి29 గురించి కీరవాణి పేర్కొన్నారు. ఇక మూడు దశాబ్ధాల తర్వాత చిరంజీవితో కలిసి విశ్వంభర సినిమాకి పని చేస్తున్నానని ఆయన అన్నారు. బాలీవుడ్‌లో అనుపమ్ ఖేర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘తన్వి: ది గ్రేట్’ సినిమాకి పని చేస్తున్నానని ఆయన వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News