Saturday, March 22, 2025

శనివారం రాశి ఫలాలు(22-03-2025)

- Advertisement -
- Advertisement -

మేషం -మిమ్మల్ని మీరు ఒంటరివారుగా భావిస్తారు. బరువు బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు.ఆర్థిక అభివృద్ధి కొరకు కృషి చేస్తారు. కలలు నిజమవుతున్నట్టుగా బ్రాంతి కలుగుతుంది.

వృషభం -మీకు సంబంధం లేని సమస్యలలో చిక్కుకుంటారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటి నుండి బయట పడతారు.ఇంట్లో శుభకార్యాలు ప్రస్తావన ఉంటుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు

మిథునం -మొండికి పడిన పనులలో కదలిక ఏర్పడుతుంది.ఊహించని అవకాశాలు కలిసి వస్తాయి నేర్పుగా అందుపుచ్చుకోండి. మీ పరపతిని పెంచుకోవడానికి చేసే యత్నాలు అనుకూలిస్తాయి.

కర్కాటకం -ఆర్థిక విషయ వ్యవహారాలు పరిష్కరించుకోవడం కష్టతరంగా మారుతుంది. నూతన ఒప్పందాలు లాభిస్తాయి. దైవానుగ్రహం రక్షిస్తున్నట్లుగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి.

సింహం – ప్రతి విషయంలో, ప్రతి కోణంలో సహనాన్ని ఓర్పును కనపరుస్తారు. ఆర్థిక అభివృద్ధి కొరకు అనేక విధాలుగా శ్రమిస్తారు. వృత్తి వ్యాపారాలపరంగా సాధారణ ఫలితాలు అందుకుంటారు.

కన్య -వృధా అయిన సమయాన్ని సాంకేతికంగా మీకు అనుకూలంగా మలుచుకుంటారు. మీకు ఊరట కలిగించే విధంగా మీ మీద వచ్చిన కొన్ని ఆరోపణలు, నిందలు కల్పితలేనని తేలిపోతుంది.

తుల -స్వప్రయోజనాల కొరకు అభివృద్ధి కొరకు మీ పరపతిని ఉపయోగించవలసి వస్తుంది.వివాదాలు పరిష్కరించుకోవడానికి మధ్యవర్తులను ఆశ్రయిస్తారు.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది.

వృశ్చికం -నిజమైన మిత్రులు ఎవరో తెలుసుకోగలుగుతారు. అవసరాలకు సరిపడధనాన్ని సమకూర్చుకోగలుగుతారు. పరిస్థితుల ప్రభావం వలన ఒకరికి ఇచ్చిన మాటను నిలుపుకోలేక పోతారు.

ధనుస్సు -వృత్తి ఉద్యోగాలపరంగా అనుకూలమైన బదిలీ లేక ఉన్నతి లభించే సూచనలు ఉన్నాయి.మిత్ర వర్గం ఆత్మీయ వర్గం అన్ని విధాల సహకరిస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదాలలో ఉంటాయి.

మకరం -మొండిబాకిలు కొంతమేర వసూలు అవుతాయి. తనఖా వస్తువులను విడిపిస్తారు. కార్యాలయంలో పని భారం అధికంగా ఉంటుంది. వ్యాపార ఉన్నతికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి.

కుంభం -పెట్టుబడుల విషయంలో నిష్ణాతుల సలహాలను సూచనలను పరిగణలోనికి తీసుకోవడం చెప్పదగినది. పోటీ ప్రపంచంలో విజయాన్ని సాధించడానికి గాను అధికంగా శ్రమిస్తారు.

మీనం -ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ సంతృప్తి చెందరు.దేవాలయ సందర్శనం చేసుకుంటారు. నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకొని లాభపడతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News