Saturday, March 22, 2025

నేడు దక్షిణాది సమరభేరి

- Advertisement -
- Advertisement -

నియోజకవర్గాల పునర్విభజనపై నేడు చెన్నైలో అఖిలపక్షం స్టాలిన్
నేతృత్వంలో సాగనున్న సమావేశం వ్యూహాలు ఖరారు చేయనున్న
దక్షిణాది నేతలు హాజరుకానున్న తెలంగాణ సిఎం రేవంత్‌రెడ్డి, బిఆర్‌ఎస్
వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్

చెన్నై: లోకసభ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కేంద్రంలోని బిజేపీ, పలు రాష్ట్రాల మధ్య జరుగుతున్న వి వాదం నేపథ్యంలో తమిళనాడు సిఎం ఎంకె స్టాలిన్ ఆధ్వర్యంలో శనివారం నా డు పలు రాష్ట్రాల ముఖ్యనాయకుల స మావేశం నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల ము ఖ్యనేతలు నేడు చెన్నై చేరుకున్నారు. మ రి కొందరు రేపు ఉదయం చెన్నైకి రానున్నారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,కర్ణాటక, ఒడిశా, కేరళ, పశ్చి మ బెంగాల్, పంజాబ్ రాష్ట్రాలనుంచి వ స్తున్న నాయకులకు ఎంకే స్టాలిన్ స్వాగ తం చెబుతూ ఓ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన కు జాతీయ ఉద్యమం చేపట్టాల్సిన అవసరాన్ని స్టాలిన్ నొక్కి చెప్పా రు. కేంద్రంలో అధికార బీజేపీ కోరుతున్నట్లు 2026 జనాభా లెక్కల ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే.

పలు రాష్ట్రాలు ముఖ్యంగా దక్షిణా ది రాష్ట్రాలు చాలా నష్టపోవల్సి వస్తుంద ని ఆయన పేర్కొన్నారు. ఈ రాష్ట్రాల ప్రా తినిధ్యం లోక్ సభలో తగ్గిపోతుందని తె లిపారు. ఎంపీ సీట్లు తగ్గి పోవడమే కాక, ఈ రాష్ట్రాల హక్కులకు భంగం వాటిల్లుతుందని, ఫెడరల్ వ్యవస్థకు కూడా ముప్పుగా పరిణమించగలదని ఆయన అభిప్రాయ పడ్డారు.అందువల్ల ఈ అంశంపై బీజేపీ యేతర పార్టీలన్నీ ఒకే తాటి పైకి వచ్చి ఏకమై పోరు సాగించాల్సి ఉందని ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. మార్చి 22 న జరిగే సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఒడిశా లోని బీజేడీ సభ్యులు, పశ్చిమ బెంగాల్ నాయకులు, పంజాబ్ ముఖ్యమంత్రి , వామపక్ష పార్టీల నాయకులు ఇతరులు హాజరు కానున్నారు. ఈ నాయకులు లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన వల్ల జరిగే నష్టాన్ని చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News