మీరు అస్తవ్యస్తం చేసిన వ్యవస్థలను మేము గాడిలో పెడుతున్నాం
మీ హయాంలో రూ.16 లక్షల కోట్లు ఖర్చు చేసి ఏం ఉద్ధ్దరించారు?
కాళేశ్వరంపై గొప్పలు చెప్పుకోవడం తప్ప ఒక ఎకరాకు నీళ్లు ఇచ్చారా?
మీరు చేసిన అప్పులు తీర్చలేక అవస్థలు పడుతున్నాం
ప్రజాస్వామ్యబద్ధంగా ఒక్కరోజైనా నడుచుకున్నారా? ఆర్థిక
క్రమశిక్షణ లేనిది మీకా? మాకా? ప్రతి ఏటా బడ్జెట్
పెంచుకుంటూ పోయి మభ్య పెట్టారు రాయలసీమ లిఫ్టుకు
అవకాశం ఇచ్చి ఇప్పుడు పెడబొబ్బలు పెడుతారా? బడ్జెట్‌పై
చర్చ ముగింపు సందర్భంగా గత ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన
డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క
మన తెలంగాణ/హైదరాబాద్ : పదేళ్ల బి ఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి వ్యవస్థలన్నింటిని కుప్పకూల్చారని డిప్యూటీ సిఎం భట్టి విక్రమా ర్క తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కు ప్పకూలిన వ్యవస్థలన్నింటినీ ఒక్కొక్కటిగా తాము గాడిలో పెడుతున్నామన్నారు. శు క్రవారం రాత్రి శాసనసభలో బడ్జెట్‌పై చ ర్చ ముగింపు సందర్భం గా భట్టి రెండు గంటలపాటు చేసిన ప్రసంగంలో గత బి ఆర్‌ఎస్ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. బడ్జెట్‌పై చర్చలో ప్రధాన ప్రతిపక్షం తరపున హరీష్ రావు లేవనెత్తిన ప్రతి అం శానికి ఆయన సవివరింగా వివరణ ఇస్తూ గత ప్రభుత్వానికి, తమ ప్రభుత్వానికి ఉ న్న తేడాను ఎత్తి చూపారు. పదేళ్లలో 16 లక్షల 770 కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టి వ్యవస్థలను విధ్వంసం చేసి, ఆర్థిక అరాచకం సృష్టించారని భట్టి విక్రమార్క మండిపడ్డా రు. ఇటువం టి వాళ్లు బుద్ధి మాంద్యం గు రించి వ్యాఖ్యానాలు చేస్తారా? అని మా జీ మంత్రి హరీశ్‌రావుపై భట్టి ధ్వజమెత్తారు. అడ్డగోలుగా బడ్జెట్‌ను పెంచకుండా దుబా రా ఖర్చులు తగ్గించామన్నారు. బట్జెట్‌లో చేయగలిగినవే పెట్టామని, చెప్పిందే చేశామని, చేయాల్సినవి ఈ ఏడాదిలోనే చేసి చూపించాన్నారు.
వందకు వంద శాతం బడ్జెట్‌ను ఖర్చు చేసి తీరుతామని భట్టి స్ప ష్టం చేశారు. మీ హయాంలో మాదిరిగా బడ్జెట్‌లో ప్రతిపాదించిన వాటిని స గానికి పైగా వదిలేయమన్నారు. బిఆర్‌ఎస్ హ యాంలో201415 మొదలుకుని 2023 24 ఆర్థిక సంవత్సరం వరకు బడ్జెట్‌లో కేటాయించిన నిధులు వాస్తవంగా ఖర్చు చేసిన లెక్కలతో సహా ఉదహరణలను భట్టి సభ ముందు ఉంచారు. బిఆర్‌ఎస్ హ యాంలో చాలా వరకు బడ్జెట్ ఖర్చుపెట్టలేదని, జిఎస్‌టి వృద్ధి రేటు 8.4 శాతం ఉం టే తమ హయాంలో 12.3 శాతంగా ఉం దని పేర్కొన్నారు. జాతీయ వృద్ధి 11.1 శాతం ఉంటే రాష్ట్ర వృద్ధిని 12.1 శాతానికి తీసుకెళ్లింది తమ హయాంలోనే అని ఆయన గుర్తు చేశారు. 2015-16లో 15 శాతం నిధులు ఖర్చు చేయలేదని, 2016 -17లో 6 శాతం నిధులు ఖర్చు చేయలేద ని వెల్లడించారు. ఇక 2017 18లో 19 శాతం నిధులు ఖర్చు చేయలేదని, అదే వి ధంగా 2018-19లో 22 శాతం నిధులు ఖర్చు చేయలేదని పేర్కొన్నారు.
2022- 23, 2023 24లో 20 శాతం నిధులు ఖర్చు చేయలేదని వివరించారు. ఈ అంశాన్ని కాగ్ స్పష్టంగా పేర్కొందని భట్టి సభకు చూపించారు. మీ లాగే బడ్జెట్ ను పెంచుకుంటూ పోతే ప్రస్తుత బడ్జెట్ 4 లక్షల 18 కోట్లు దాటేదన్నారు. గత ప్రభుత్వంలా అడ్డగోలుగా బడ్జెట్ ను పెంచలేదని, 4.7 శాతమే బడ్జెట్ పెంచామని, అందుకే బడ్జెట్‌ను 3.04 లక్షల కోట్లకు కుదించామన్నారు. . అందుకే చేయగలిగినవే బడ్జెట్‌లో పెట్టామని, వందకు వంద శాతం బడ్జెట్‌ను ఖర్చు చేసి తీరుతామని స్పష్టం చేశారు. తమ ఏడాది మూడు నెలల పాలనలో వచ్చిన ఆదాయం 2లక్షల 80 వేల 603 కోట్లు కాగా అందులో ఉద్యోగుల జీతాలకు రూ. 77 వేల కోట్లు, అప్పులకు 88 వేల కోట్ల వడ్డీలు కట్టామని పేర్కొన్నారు. ఇతరత్రా పధకాలకు లక్షా 34 వేల కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. మొత్తంగా రూ.2లక్షల 99వేల414 కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు. గత పదేళ్లలో మీరు చెప్పుకునే ఘనత ఒక్క కాళేశ్వరం ఒక్కటేనని పేర్కొంటూనే ఆ కాళేశ్వరం ఎట్లుందో మనందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. క్రమశిక్షణ లేకనే అడ్డగోలుగా ఖర్చు చేసింది మీరేనని బిఆర్‌ఎస్‌పై ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వానికి బుద్దిమాంద్యం మందగించిందని హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ బాష పట్ల స్ పద్దతి మార్చుకోవాలని, మీ మాదిరిగా నోరు జారమని దుయ్యబట్టారు.
సిఎం రేవంత్ నాయకత్వంలో యావత్ మంత్రివర్గం కూర్చుని బడ్జెట్ ఆశలపల్లకీలో ఉండకూడదని, ఎవరేమనుకున్నా ప్రజలకు మనం వాస్తవాలు చెప్పాలని, ఆ వాస్తవాలకనుగుణంగా తెలంగాణకు పునాదులు వేద్దామన్నారు. పది సంవత్సరాల వరకు ఇప్పటివరకు ఆ గ్యాప్ ఎంత ఉందనేది అర్థమవుతోందన్నారు. హరీశ్‌రావు 10 సంవత్సరాలు మంత్రిగా చేశారని, కొద్ది రోజులు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మంత్రిగా చేశారని గుర్తు చేశారు. వారికి అన్ని విషయాలు తెలుసు. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు చూపించి తెలంగాణ అభివృద్ధి గురించి వీసమెత్తు ఆలోచన చేయలేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇసుకు విక్రయం జరుగుతూ ఉండేది. ఒక్క ఇసుకలోనే 30 వేల టన్నుల ఇసుక 70 వేల టన్నులకు పెరిగిందన్నారు. రోజుకు కోటిన్నర వచ్చే ఆదాయం నేడు మూడు కోట్లకు పెరిగిందని, సంవత్సరానికి రూ.6౦౦ కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయామని వెల్లడించారు. ఏడాది మొత్తంగా రూ.6 వేల కోట్లు ప్రభుత్వ ఖజానానికి రావాల్సింది ఎక్కడికి పోయిందో చెప్పాలని కోరారు. ఇసుక మాఫియాని పూర్తిగా కట్టడి చేశామని, రాష్ట్రంలో ఉన్న అన్ని మాఫియాలను కట్టడి చేస్తామని అన్నారు. సహజ వనరులు ప్రతీదీ ఈ రాష్ట్ర ఖజానాకు జమ కావాల్సిందేనని స్పష్టం చేశారు. రుణమాఫీ పేరు మీద అదనంగా రూ.20 వేల కోట్లు ఖర్చు పెట్టాం. రూ.57,946 ఉద్యోగాలు ఇచ్చాం. ఇంటికో ఉద్యోగం అన్నారు. ఇచ్చారా? అని నిలదీశారు. మేమె ప్పుడు అడ్డగోలుగా మాట్లాడలేదు. మేము పడ్డ అవమానాలు ఇంకెవరూ పడి ఉండరు. సిఎల్‌పి బృందంగా భద్రాచలం బయల్దేరితే అడవుల్లో అర్ధరాత్రి శాసనసభ్యులను వదిలేసింది మీరు కాదా .. ప్రజాస్వామ్య బద్ధంగా ఒక్కరోజైనా మీరు నడుచుకున్నారా అని ప్రశ్నించారు. వీరు నిర్బంధం గురించి మాట్లాడే నైతిక అర్హత మీకెక్కడిది అని ప్రశ్నించారు. ఇక కృష్ణా జలాల గురించి మాట్లాడారు.
శ్రీశైలం, జూరాల మధ్య రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కడుతూ ఉన్నారని, ప్రతిపక్షంలో ఉండి మేం ఆపడానికి ప్రయత్నిస్తే మమ్మల్ని అనాడు అరెస్ట్ చేసిన మీరే ఇప్పుడు కృష్ఱా జలాలపై పెడబొబ్బలు పెడుతున్నారని ఆరోపించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ను నుంచి అక్రమంగా దోచుకువెళుతున్న నీటిని నిలుపుదల చేయడానికి సుప్రీంకోర్టు దాకా వెళ్లి తాము ప్రయత్నిస్తున్నామని అన్నారు. అలాంటిది మీరే ఇప్పుడు వాటిపై మాట్లాడుతుంటే నవ్వాలో, ఏడవాలో తెలియడంలేదన్నారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి చేయకపోగా ఉపముఖ్యమంత్రిగా ఉన్న దళితుడిని బర్తరఫ్ చేసిన చరిత్ర దేశంలో ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. పదేళ్లు ప్రజలను ఆశల్లో ఉంచి గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. ఇదిలా ఉండగా ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు తన సమాధానం సవివరంగా ఉండడంతో ఇక క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని భట్టి ప్రకటించగానే స్పీకర్ ప్రసాద్ కుమార్ సభను శనివారం ఉదయం 10 గంటలకు వాయిదా వేసినట్లు ప్రకటించారు. కాగా శాసనమండలిలో సైతం రిప్లై ఇచ్చిన అనంతరం వాయిదా వేశారు.