Saturday, March 22, 2025

కొత్త జిల్లాల్లో డిసిసిబిలు

- Advertisement -
- Advertisement -

నాబార్డు చైర్మన్‌కు సిఎం రేవంత్‌రెడ్డి
సూచన మరిన్ని సహకార సంఘాలు
ఏర్పాటు చేయాలని ప్రతిపాదన
ఆర్‌ఐడిఎఫ్ కింద తక్కువ వడ్డీకి
రుణాలు, మహిళా గ్రూపులకు ప్రత్యేక
పథకాలు రూపొందించాలని విజ్ఞప్తి
మన తెలంగాణ/హైదరాబాద్ :కో- ఆపరేటివ్ సొసైటీలను బలోపేతం చేయాలని, మరిన్ని కో- ఆపరేటివ్ సొసైటీలను ఏర్పాటు చేయాలని నాబార్డ్ చైర్మన్‌కు సిఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నాబార్డ్ చైర్మన్ షాజీ కేవీ, అధికారులు భేటీ అయ్యారు. సిఎంకు శాలువాతో సత్కరించారు. ఆర్‌ఐడిఎఫ్ కింద తక్కువ వడ్డీకి రుణాలు, మైక్రో ఇరిగేషన్‌కు ని ధులు ఇవ్వాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చైర్మన్‌ను కోరారు. స్వయం సహాయక సంఘాల మహిళా గ్రూపులకు ప్రత్యేక పథకాన్ని రూపొందించాలని సిఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఐకేపి, గోడౌన్స్, రైస్ మిల్లులను నాబార్డుకు అనుసంధానం చేసి రాష్ట్రంలో మిల్లింగ్ కెపాసిటీ పెంచేందుకు సహకరించాలని సిఎం కోరారు. ‘

కొత్త జిల్లా ల్లో డిసిసిబిలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రికి నాబా ర్డ్ చైర్మన్ ప్రతిపాదించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మం జూరైన నాబార్డు స్కీం నిధులు మార్చి 31వ తేదీలోగా ఉపయోగించుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. నాబార్డు పరిధిలోని స్కీంలకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో వీలైనంత ఎక్కువగా ఉపయోగించుకోవాలని సిఎం సూచించారు. స్వయం సహాయక మహిళా సంఘాలకు అందించే సోలార్ ప్లాంట్స్ నిర్వహణను నాబార్డుకు అనుసంధానం చేయాలని ఆయన సూచించారు. కొత్త గ్రామపంచాయతీలకు రూరల్ కనెక్టివిటీ పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో నాబార్డు ప్రతినిధులతో పాటు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సిఎంను కలిసిన కాళోజీ హెల్త్ యూనివర్శిటీ వైస్ చాన్సలర్
కాళోజీ నారాయణ రావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైస్ చాన్సలర్ డాక్టర్ పివి నందకుమార్ రెడ్డి సిఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
సిఎంను కలిసిన బిసి కమిషన్ చైర్మన్, సభ్యులు
సిఎంను బిసి కమిషన్ చైర్మన్ జి.నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి రంగు సిఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్‌లు కల్పించడానికి రెండు బిల్లులను ఆమోదించినందుకు కమిషన్ తరపున వారు ధన్యవాదాలు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News