మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర విభజన తో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను పదేండ్లు పాలించిన పాలకులు అప్పుల పాలు చేశారని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నా రు. శుక్రవారం శాసనమండలిలో బడ్జెట్ చర్చ సందర్భంగా బిఆర్‌ఎస్ పక్షనేత మధుసూదనచారి లేవనెత్తిన అంశాలకు మంత్రి సమాధానం ఇస్తూ ప్రజల ఆకాంక్షల మేరకు ప్రజాపాలన జ రగలేదని, తాను కూడా ఆనాడు మూడేండ్ల పా టు మంత్రిగా పనిచేసినట్లు మంత్రి జూపల్లి తెలిపారు. రాష్ట్రాన్ని పాలించిన బిఆర్‌ఎస్ పార్టీ కేం ద్రంలోని బిజెపిని ఆదర్శంగా తీసుకుని రైతుల కు రుణమాఫి ఆలోచన ఎత్తివేసిందన్నారు. గొ ర్రెల పంపిణీ పథకాన్ని బిఆర్‌ఎస్ ప్రభుత్వం నిలిపివేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై నిందవేయడం సరికాదన్నారు. దాంతో బిఆర్‌ఎస్ సభ్యులు మంత్రి మాటలకు అభ్యంతరం వ్యక్తం చేయడంతో బిఆర్‌ఎస్, కాంగ్రెస్ సభ్యల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. పదేండ్ల కెసిఆర్ పాలనలో చేసిన అప్పులతో సంపద సృష్టించారని, అప్పులపై కాంగ్రెస్ ప్రభుత్వం పదేపదే దుష్ప్రచారం చేస్తున్నదని బిఆర్‌ఎస్ సభ్యులు అభ్యంత రం వ్యక్తం చేశారు. పది సంవత్సరాల బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఎఫ్‌ఆర్బీఎం పరిమితికి లోబడి చేసిన అప్పులు కేవలం రూ. 3 లక్ష ల కోట్లు మాత్రమే. కార్పొరేషన్లు తీసుకున్న రు ణాలకు నాడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీల మొత్తం కేవలం రూ. లక్షా 21 వేల కోట్లు మాత్రమేనని మధుసూధనచారి వెల్లడించారు.
బిఆర్‌ఎస్ డిఎన్‌ఏలోనే కరప్షన్ ఉంది: మంత్రి సీతక్క
బిఆర్‌ఎస్ పార్టీ డిఎన్‌ఏ లోనే కరప్షన్ ఉంది, ఇ ష్టానుసారంగా ఎస్టిమేషన్స్ పెంచి దోచుకుతున్నారు. ఎఫ్‌ఆర్‌బిఎం నిబంధనలకు విరుద్ధంగా అప్పల కోసమే కొన్ని కార్పొరేషన్లను ఏర్పాటు చేశారని అన్నారు. సిఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో మీ డియా వేదికలపై తెలంగాణ రాష్ట్రం పరువు తీ స్తున్నారని ఎమ్మెల్సీ కె.కవిత ఆరోపణలకు మం త్రి సీతక్క తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర పరు వు తీసింది ఎవరు ? మీ కుటుంబమే రాష్ట్రం ప రువు తీసింది, మాకు డిల్లీ వ్యా పారాలు తెలియ వు, ఢిల్లీ వ్యాపారాలతో తెలంగాణ పరువు తీ సింది మీరు, మీ కుటుంబం అని వివరించారు.
అంతకు ముందు మండలిలో బడ్జెట్ చర్చలో కవిత మాట్లాడుతూ మాజి సిఎం కెసిఆర్ ను నిం దించేందుకే ఆర్థిక పరిస్థితి బాగాలేదని ప్రభుత్వం అబద్ధాలు చెబుతుందని, అప్పులపై తప్పుడు లెక్కలు చెబుతున్న ప్రభుత్వానికి ప్రజల బుద్ధి చెబుతారని, వారి అబద్ధాలు ఆపకపోతే ప్రివిలేజ్ మోషన్ ఇస్తామన్నారు. అందు కు మంత్రి సీతక్క అభ్యంతరం వ్యక్తం చేస్తూ మహిళలకు అడుగడుగున అన్యాయం చేసింది టిఆర్‌ఎస్ ప్రభుత్వం, తొలి ప్రభుత్వంలో మహిళకు మం త్రి పదవి ఇవ్వలేదు, మహిళా కమిషన్ ఏర్పాటు చేయలేదు, మహిళలు పొదుపు చేసుకున్న 1800 కోట్ల అభయ హస్తం నిధులు ఇవ్వలేదు, పావలా వడ్డీ ఇవ్వలేదు, మహిళ సంఘాలకు ఇవ్వాల్సిన రూ.3,700 కోట్ల వడ్డీ లు చెల్లించలేదు. తెలంగాణను మీరు సస్యశ్యామలం చేస్తే, రైతులు ఎందుకు ఇబ్బందులు పడ్డారు, కాంగ్రెస్ ప్రభుత్వం పంట కాలువలు మూసివేసినట్లుగా బిఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని విమర్శించారు.
కరువుభత్యం ఇవ్వాలి : ఎవిఎన్ రెడ్డి
ఉద్యోగులు, ఉపాధ్యాయుల వ్యతిరేకత కారణంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభు త్వం ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పెండింగ్ కరువు భత్యం(డిఏ) చెల్లించాలని బి జెపి సభ్యుడు ఎవిఎన్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బడ్జెట్ చర్చలో ఆయన మాట్లాడుతూ తలాపాపం తిలాపిడికెడు అన్నట్లు గత ప్రభు త్వం ఇష్టానురీతిలో అప్పులు చేసి ఎక్కడో ఉం డాల్సిన తెలంగాణ అప్పుల ఊబిలోకి కూరుకుపోయిందని విమర్శించారు.