- Advertisement -
హైదరాబాద్: భవిష్యత్‌లో భూభారతిపైనే ఎన్నికలకు వెళ్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పదో రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసన సభలో పొంగులేటి మాట్లాడారు. బిఆర్‌ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి అసత్యాన్ని సత్యం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టే వారిని ప్రజలు ఓడించారని పొంగులేటి చురకలంటించారు.
భూభారతిపై కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్తే తాము కూడా ధరణిపైనే ఎన్నికలకు వెళ్తామని ఎంఎల్‌ఎ పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది భూభారతి కాదు అని భూహారతి చట్టం అని పల్లా విమర్శలు చేశారు. జమాబంది పేరుతో మరో దుకాణం తెరిచిందని, ఇప్పుడు జమాబంది ఎందుకు ప్రభుత్వమే చెప్పాలని నిలదీశారు. ధరణి ఆధారంగానే ఇప్పటివరకు పథకాలు అమలు చేస్తున్నారని ప్రశంసించారు.
- Advertisement -