- Advertisement -
హైదరాబాద్: నగరంలోని సరూర్‌నగర్‌కు చెందిన అప్సర హత్య కేసులో కోర్టు తీర్పు వెలువరించింది. 2023లో సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితుడు సాయికృష్ణకు జీవితఖైదు విధించింది. పెళ్లి చేసుకోవాలని అడినందుకు సాయి కృష్ణ అనే పూజారి అస్పరను దారుణంగా హత్య చేసి.. ఆమె మృతదేహాన్ని డ్రైనేజీలో పూడ్చిపెట్టాడు. ఆపై ఏమీ తెలియనట్లు ఆమె కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేసిన పోలీసులు అతడే అసలు నిందితుడని తేల్చారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ జరుగుతోంది. తాజాగా సాక్ష్యాధారాలను పరిశీలించిన రంగారెడ్డి కోర్టు నిందితుడికి జీవితఖైదు విధించడంతో పాటు.. సాక్ష్యాలు తారుమారు చేసినందుకు మరో ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. రూ.10 వేలు జరిమానా కూడా వేసింది. దీంతో పాటు.. మృతురాలి కుటుంబానికి రూ.10లక్షలు పరిహారాన్ని మంజూరు చేసింది.
- Advertisement -