Tuesday, April 1, 2025

ఐపిఎల్ 2025: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా

- Advertisement -
- Advertisement -

గువాహటి: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా బర్సాపరా స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ రెండు జట్లు టోర్నమెంట్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో ఓటమిపాలయ్యాయి. టోర్నమెంట్‌ ఆరంభ మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓటమిపాలు కాగా.. రెండో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు చేతిలో రాజస్థాన్ జట్టు ఓడిపోయింది. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం ఇరు జట్లకు కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో రెండు ఫ్రాంచైజీలు తమ జట్టులో ఒక మార్పు చేశాయి. కోల్‌కతా జట్టులో సునీల్ నరైన్ స్థానంలో మొయిన్ అలీ జట్టులోకి రాగా.. రాజస్థాన్ జట్టులో ఫరూఖీ స్థానంలో హసరంగా జట్టులోకి వచ్చాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News