Tuesday, April 1, 2025

కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

కోచింగ్ సెంటర్‌గా ప్రసిద్ధి గాంచిన రాజస్థాన్ లోని కోటా ప్రాంతంలో తాజా గా మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. బీహార్ రాష్ట్రం నలంద జిల్లాకు చెందిన హర్షరాజ్ శంకర్ (17) మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోచింగ్ కోసం కోటాకు వచ్చాడు. అక్కడ జవహర్ నగర్ లోని హాస్టల్‌లో ఉంటూ గత ఏడాది ఏప్రిల్ నుంచి కోచింగ్ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం అతను తన హాస్టల్ రూమ్‌లో ఐరన్‌రాడ్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్పారు.

హాస్టళ్లు, పీజీల్లో స్పింగ్ లోడెడ్ ఫ్యాన్లను ఏర్పాటు చేసిన కారణంగా ఐరన్ రాడ్‌కు ఉరేసుకున్నట్టు పేర్కొన్నారు. అతడి గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని, మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ కోసం ఆస్పత్రికి తరలించామని, దీనిపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. తాజా సంఘటనతో ఈ ఏడాది కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు 9 కి చేరుకున్నాయి. గత ఏడాది 17 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోగా, అంతకు ముందు ఏడాది 30 మంది వరకు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News