Tuesday, April 1, 2025

కేంద్ర మాజీ మంత్రి యత్నాల్‌ను బహిష్కరించిన బిజెపి

- Advertisement -
- Advertisement -

గత కొద్దికాలంగా వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణపై కేంద్ర మాజీ మంత్రి, కర్ణాటక బీజేపీ సీనియర్ నేత బసనగౌడ పాటిల్ యత్నాల్‌ను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బీజేపీ అధిష్ఠానం బుధవారం బహిష్కరించింది. పలుమార్లు హెచ్చరించినప్పటికీ వైఖరి మార్చుకోకపోవడంతో పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. పాటిల్ పదేపదే వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. మాజీ సిఎం యడ్యుయారప్పపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయడాన్ని బీజేపీ తీవ్రంగా పరిగణించింది. అలాగే పార్టీ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన రన్యారావుపై ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్రపై కూడా ఆయన కయ్యానికి కాలుదువ్వారు. విజయేంద్ర అవినీతికి పాల్పడుతున్నారంటూ విమర్శించారు. దీనిపై గత ఫిబ్రవరిలో కేంద్ర క్రమశిక్షణా కమిటీ ఆయనకు షోకాజ్ నోటీసు పంపింది. తాజాగా దీనిపై చర్య తీసుకుంటూ ఆయనపై బహిష్కరణ వేటు వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News