Tuesday, April 1, 2025

మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలి

- Advertisement -
- Advertisement -

కేబినెట్‌లో సముచిత ప్రాధాన్యం కల్పించాలని సిఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ
సిఎం భట్టి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మాదిగ ఎంఎల్‌ఎల విజ్ఞప్తి అధిష్ఠానాన్ని
కలవడానికి ఢిల్లీ వెళ్లిన ఎంఎల్‌ఎల బృందం ఎవరు ఎంతో వారికి అంత
అని గతంలోనే రాహుల్ అన్నారని ఎంఎల్‌ఎ అడ్లూరి లక్ష్మణ్ వ్యాఖ్య

మన తెలంగాణ/హైదరాబాద్ : మంత్రివర్గ విస్తరణలో తమ సామాజిక వర్గానికి అవకాశం క ల్పించాలని అధిష్టానానికి నిన్న (మంగళవారం) లేఖ రాసిన మాదిగ ఎమ్మెల్యేలు తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసారు. శాసనసభ ప్రాంగణంలో వారు బుధవారం సిఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని వేర్వేరుగా వారి ఛాంబర్లలో కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారంతా అధిష్టాన పెద్దలను కలువడానికి ఢిల్లీకి వెళ్తున్నట్టు మీడియాకు వెల్లడించారు. తమ ప్ర యత్నాలు మాదిగలకు మంత్రివర్గంలో స్థానం క ల్పించాలన్నదే తప్ప తాము మరే సామాజిక వ ర్గానికి వ్యతిరేకం కాదని వారు స్పష్టం చేసారు. రాష్ట్రంలో మాదిగ సామాజిక వర్గం జనాభా అత్యధికంగా ఉన్నప్పటికీ ఎంపి టికెట్ల కేటాయింపులో తమకు తగిన ప్రాధాన్యత కల్పించలేదని,

ఇటీవల ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికలోనూ తమకు అవకాశం దక్కలేదని మా దిగ ఎమ్మెల్యేలు అడ్లూరిలక్ష్మణ్, కవ్వంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, మందుల సామేలు, కాలే యాదయ్య, లక్ష్మికాంతరావు వా పోయారు. తమ సామాజిక వర్గం మొదటి నుం చి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచామని గుర్తు చే సారు. తమ సామాజిక వర్గానికి జరిగిన అన్యా యం భర్తి చేస్తూ కనీసం ఈసారి జరిగే మంత్రివర్గ విస్తరణలోనైనా న్యాయం చేయాలని కోరు తూ టీపీసీసీ రాష్ట్ర ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు లేఖ రాసినట్టు తెలిపారు. తమ సామాజిక వ ర్గానికి మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించడానికి చొరవ తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేసినట్టు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ మీడియాకు తెలిపారు.

మంత్రి పదవి అయినా ఇవ్వండి : మాదిగ ఎమ్మెల్యేల డిమాండ్
తెలంగాణలో అతిపెద్ద సామాజిక వర్గమైన మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలనితమ వినతి పత్రంలో అభ్యర్థించారు. కాంగ్రెస్ పార్టీ గత పార్లమెంటరీ ఎన్నికల్లో రాష్ట్రంలో నాగర్‌కర్నూల్, పెద్దపల్లి, వరంగల్ నియోజకవర్గాలలో మాదిగ సమాజానికి ఒక్క సీటు కూడా కేటాయించలేదని గుర్తు చేశారు. ఆ జిల్లాల్లో మాదిగ సమాజం పెద్ద సంఖ్యలో ఉందని తెలిపారు. ఇటీవల ఎంఎల్‌ఎ కోటా ఎంఎల్‌సి ఎన్నికల్లో కూడా మాదిగ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేదని చెప్పారు. తాము ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నామని, కానీ తమ సామాజికవర్గానికి రాష్ట్ర మంత్రివర్గంలో తమ జనాభా ప్రకారం తగినంత ప్రాతినిధ్యం లేదని వాపోయారు. తాము ఏ వర్గానికి వ్యతిరేకం కాదు అని, తమ జాతికి సరైన ప్రాతినిధ్యం కావాలని స్పష్టం చేశారు. మాదిగ సమాజం నుంచి ఒక మంత్రి పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ, రాష్ట్ర మంత్రివర్గంలో సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

ఢిల్లీ వెళ్లి ఖర్గే, రాహుల్ ను కలుస్తాం: అడ్లూరి లక్ష్మణ్ చిట్ చాట్
రాష్ట్రంలో జరుగనున్న మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. అసెంబ్లీ లాబీలో బుధవారం ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తమ సామాజికవర్గానికి మంత్రి ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలవడంతోపాటు ఢిల్లీకి వెళ్లి రాహుల్‌గాంధీ, మల్లికార్జున్ ఖర్గేను కలుస్తానని చెప్పారు. ఎవరు ఏంతో వారికి అంత అని గతంలో రాహుల్ గాంధీ చెప్పారని గుర్తు చేశారు. తమ సామాజికవర్గానిక మంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ అగ్రనేతలందరికీ వినతి పత్రాలు అందజేస్తానని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News