ఐపిఎల్ 18వ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ బోణీ కొట్టింది. స్టార్ బ్యాటర్ క్వింటన్ డికాక్ (97), అంగ్రీష్ రఘువంశి(22) బ్యాట్‌తో విజృంభించడంతో మరో 15 బంతులు విగిలుండగానే విజయాన్ని అందుకుంది. దీంతో తొలి మ్యాచ్‌లో ఓటమి చెందిన కోల్‌కతా రెండో మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో కోల్‌కతా బౌలర్లు సఫలమయ్యారు. ఓపెనర్ సంజు శాంసన్ 2 ఫోర్లతో 13 పరుగులు చేసి ఔటయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ రియాన్ పరాగ్ కొద్ది సేపు మెరుపులు మెరిపించాడు.
ధాటిగా ఆడిన పరాగ్ 15 బంతుల్లో 3 సిక్సర్లతో 25 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ వెంటనే మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా పెవిలియన్ చేరాడు. యశస్వి రెండు ఫోర్లు, మరో 2 సిక్స్‌లతో 29 పరుగులు సాధించాడు. తర్వాత వచ్చిన నితీశ్ రాణా (8), వనిందు హసరంగ (4) నిరాశ పరిచారు. వికెట్ కీపర్ ధ్రువ్ జరేల్ ఒక్కడే కాస్త పోరాటం చేశాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన జురేల్ ఐదు ఫోర్లతో 33 పరుగులు చేశాడు. ఆర్చర్ 16 పరుగులు సాధించాడు. నైట్‌రైడర్స్ టీమ్‌లో వైభవ్, హర్షిత్, మోయిన్, వరుణ్ రెండేసి వికెట్లను పడగొట్టారు.