Tuesday, April 1, 2025

ప్రియుడితో భార్యకు పెళ్లి చేసిన భర్త…. వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

లక్నో: భార్యకు ప్రియుడితో భర్త పెళ్లి చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ జిల్లాలో జరిగింది. ప్రియుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండడంతో భార్యకు ప్రియుడుతో పెళ్లి చేశాడు భర్త. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆరు సంవత్సరాల క్రితం బబ్లూ, రాధిక అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉపాధి నిమిత్తం బబ్లూ ఇంటికి దూరంగా ఉండేవాడు. ఈ క్రమంలో స్థానిక యువకుడైన వికాస్ తో రాధిక వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియడంతో పలుమార్లు గొడవలు జరిగాయి. భర్త చివరికి ఓ నిర్ణయం తీసుకున్నాడు. తన భార్యకు ప్రియుడితో కలిసి పెళ్లి చేశాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News