ఆదిలాబాద్: ఒక అమ్మాయిని మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటుండగా సెల్‌ఫోన్ కాన్ఫరెన్సు మోసగాడిని పట్టించింది. ఈ సంఘటన ఆదిలాబాద్‌లో జిల్లాలో జరిగింది. ఓ మండలానికి చెందిన యువకుడికి మరో మండలానికి చెందిన యువతితో నెల రోజుల క్రితం పెద్దలు పెళ్లి నిశ్చయం చేశారు. పెళ్లికి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. రెండు కుటుంబాలు పెళ్లి పనులు చేసుకుంటున్నాయి.
పెళ్లి కుమార్తె తన కాబోయే భర్తకు ఫోన్ చేసింది. అప్పటికే అతడు మరొకరుతో కాల్‌లో మాట్లాడుతున్నాడు. ఆ కాల్‌ను హోల్డ్‌లో పెట్టి ఈ కాల్‌ను లిఫ్ట్ చేసి బైక్‌పై ఉన్నానని చెప్పాడు. మళ్లీ కాల్ చేస్తానంటూ పెళ్లి చేసుకోబోయే యువతికి చెప్పాడు. ఆ కాల్‌ను కట్ చేయకుండా మెర్జ్ చేయడంతో యువకుడు తన ప్రియురాలుతో మాట్లాడుతున్న కాల్‌ను పెళ్లి కుమార్తె రికార్డు చేసింది. కాల్ రికార్డును పెద్దలకు చూపించడంతో పెళ్లి రద్దైంది. పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులు కట్నం డబ్బులను తిరిగి తీసుకున్నారు. కాల్ కాన్ఫరెన్స్ పెళ్లిని చెడగొట్టిందని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.