Tuesday, April 1, 2025

పంత్, గిల్ ఆ నిర్ణయాలు తీసుకోవద్దు: సెహ్వాగ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐపిఎల్ 2025 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తొలి మ్యాచ్‌లో ఓడిపోయాయి. డిసి చేతిలో లక్నో ఓటమి చవిచూడగా గుజరాత్‌పై పంజాబ్ గెలిచింది. గుజరాత్, లక్నో కెప్టెన్లు నిర్ణయాలతో ఆ జట్టు ఓటమిని చవిచూశాయని భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంతో రిషబ్ పంత్ విఫలం అవుతున్నాడని, ఇవాళ హైదరాబాద్ జట్టుతో ఢిల్లీ ఆడనున్న నేపథ్యంలో పంత్ దూకుడుగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించాడు. జట్టులో ఆవేశ్ ఖాన్ ఉన్న శార్థూల్ ఠాకూర్‌లాగా రెండు వికెట్లు తీసేవాడు కాదేమోనని అనుమానం వ్యక్తం చేశారు. బౌలర్లను ఉపయోగించుకోవాల్సిన బాధ్యత కెప్టెన్లపై ఉంటుందని తెలియజేశాడు. ఢిల్లీ ఒక్క ఓవర్‌లోనే గెలువలేదని, తుది వరకు పోరాటం చేసి గెలించిందని సెహ్వాగ్ ప్రశంసించారు. తుది జట్టులో లేని వారి గురించి ఆలోచన చేయకుండా ఉన్నవారితో గెలవడంతో అలవాటు చేసుకోవాలని పంత్‌కు చురకలంటించారు.

సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నప్పుడు అతడిని పక్కకి పెట్టి అర్షద్ ఖాన్‌తో బౌలింగ్ చేయించడంతోనే ఓటమిని కొని తెచ్చుకున్నారని వీరేంద్ర సెహ్వాగ్ తెలిపారు. ఒక వేళ సిరాజ్‌తోనే బౌలింగ్ చేయించి పంజాబ్ ఒత్తిడికి గురైదే చెప్పుకొచ్చారు. సిరాజ్‌ను డెత్ ఓవర్లకు తీసుకరావాల్సిన అవసరం లేదన్నారు. గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా తన స్థాయికి లేనట్టుగా కనిపించాడని అన్నారు. అతడి ఉత్సహం తగ్గిందని, కెప్టెన్సీ నిర్వహించడంలో సిద్ధంగా లేనిట్టుగా కనిపిస్తోందన్నారు. బౌలర్లను ఉపయోగించుకోవడంలో గిల్ యాక్టివ్ కనిపించలేదని సెహ్వాగ్ పేర్కొన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News